
జీడిమెట్ల, వెలుగు: ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్‌చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు పడింది. జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ కథనం ప్రకారం.. యూపీకి చెందిన ఓ కుటుంబం కొన్నేండ్ల కింద బతుకుదెరువు కోసం జగద్గిరిగుట్ట మగ్ధూమ్నగర్కు వచ్చారు. కుటుంబంలోని ఓ బాలుడు(7) 2017 జూన్ 26న కాలనీలో ఆడుకుంటుండగా అక్కడే ఉంటున్న బిహార్‌కు చెందిన గిరిధర్(32) కిడ్నాప్ చేశాడు.
హెచ్ఎంటీ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కూకట్పల్లి ఫాస్ట్ట్రాక్స్పెషల్కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.