నా హత్యకు కుట్ర

నా హత్యకు కుట్ర
  • పోలీసులకు ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఫిర్యాదు
  • అదుపులోకి నిజామాబాద్ జిల్లా కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్
  • బుల్లెట్లు లేని ఒక నాటు తుపాకీ, ఎయిర్ పిస్టల్, కత్తి స్వాధీనం
  • ఇదంతా ఎమ్మెల్యే కుట్రలో భాగమంటున్న సర్పంచ్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ :  తన హత్యకు కుట్ర జరిగినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య భర్త  ప్రసాద్ గౌడ్ తన హత్యకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బుల్లెట్లులేని ఒక నాటుతుపాకీ, పెల్లెట్లు ఉన్న ఒక ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌ నంబర్ 12లో వేమూరి ఎన్‌‌‌‌‌‌‌‌క్లేవ్‌‌‌‌‌‌‌‌లో జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి నివాసం ఉంటున్నారు. కల్లెడ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లావణ్య కుటుంబంతో కొంతకాలంగా ఆయనకు రాజకీయ విభేదాలున్నాయి. లావణ్యపై వచ్చిన అవి నీతి ఆరోపణలతో పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఆమెను 6నెలల సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనికి కారణం జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అని అనుమానంతో ఆమె భర్త ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కలవాలంటూ సెక్యూరిటీకి చెప్పాడు. ఎమ్మెల్యే థర్డ్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారని, వచ్చే వరకు వెయిట్‌‌‌‌‌‌‌‌చేయాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.
 

ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ వద్ద ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గన్స్‌‌‌‌‌‌‌‌
సెక్యూరిటీ చెప్పిన ప్రకారం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ కొద్దిసేపు హాల్‌‌‌‌‌‌‌‌లో వెయిట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 8.15 గంటల సమయంలో లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో మూడో అంతస్తుకు వెళ్లాడు. ఇది గమనించిన జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డులతో ప్రసాద్​ను బయటకు పంపించారు. ఈ క్రమంలోనే గన్‌‌‌‌‌‌‌‌మెన్​తో  ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను చెక్‌‌‌‌‌‌‌‌ చేయించగా ఎయిర్‌‌‌‌‌‌‌‌గన్​ బయటపడింది. బంజారాహిల్స్​ పోలీసులు ప్రసాద్‌‌‌‌‌‌‌‌ కారును తనిఖీ చేయగా మరో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గన్‌‌‌‌‌‌‌‌ దొరికింది. ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను ముందుగా టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నేపాల్‌‌‌‌‌‌‌‌ వెళ్లి గన్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

జీవన్​రెడ్డే కుట్ర పన్ని నా భర్తను ఇరికించాడు: లావణ్య
జీపీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరుగలేదు.  రూ.18 లక్షల50 వేలు అప్పు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాం. ఇందులో రూ.4 లక్షల50 వేలకు ఎంబీ రికా ర్డు చేయడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. ఈ సాకు చూపుతూ నన్ను 6నెలలు  సస్పెం డ్ చేశారు. సస్పెన్షన్ గడువు ముగిసినా చార్జ్  ఇవ్వలేదు. అప్పులవాళ్ల వేధింపులు పెరిగిపోయాయి. దీంతో నేను, నా భర్త ఇద్దరం వెళ్లి నెల కింద జీవన్​రెడ్డిని కలిసి, చార్జ్​ ఇవ్వాలని వేడుకున్నాం.  కలెక్టర్​ను కలవాలని చెప్తే సోమవారం కలెక్టర్, అడిష నల్​ కలెక్టర్​ ఇద్దరినీ  కలిశాం. స్పందించక పోవడంతో  హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేను కలిసి వద్దామని నా భర్త అన్నాడు. చిన్నపిల్లలు ఉన్నందున నేను వెళ్లలేదు. మా ఆయన ఒక్కరే వెళ్లారు. కావాలని నా భర్తను కుట్ర పూరితంగా కేసులో ఇరికించారు.