భారత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారత్ జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పోస్టర్ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. పాదయాత్ర జగిత్యాల చేరుకున్న అనంతరం భారత్ జోడో యాత్రలో పాల్గొంటామని చెప్పారు. జోడో యాత్రకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. భారత జాతి ఐక్యతకు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పోస్టర్లు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న మల్లిఖార్జున్ ఖర్గేకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. 

అధికార కాంక్షతో దేశాన్ని కులాల మతాల పేరుతో ఎన్డీయేగా విభజించడాన్ని నిరసిస్తూ.. రాహుల్ జోడో యాత్ర కొనసాగుతోందని జీవన్ రెడ్డి అన్నారు. నెహ్రూ హయాంలో జాతీయ స్థాయిలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇందిరా గాంధీ చివరి శ్వాస వరకు దేశం కోసం పని చేసి ప్రాణాలు అర్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రజలను కులాలమతాల వారీగా విభజించే ప్రయత్నం జరిగిందని.. అప్పుడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను అడ్డుకున్నారని, ఇప్పుడు రాహుల్ పాదయాత్ర విషయంలో అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.