బీఆర్ఎస్ వస్తే బతుకమ్మపై  లిక్కర్ బాటిల్ పెడ్తరు: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వస్తే బతుకమ్మపై  లిక్కర్ బాటిల్ పెడ్తరు: జీవన్ రెడ్డి
  •     కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కవిత బతుకమ్మపై గౌరమ్మకు బదులు లిక్కర్‌‌‌‌‌‌‌‌ బాటిల్ పెడుతుందని కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం జగిత్యాలలో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గతంలో ఎలిజబెత్ క్వీన్ ఉండే. ఇప్పుడు కొత్తగా లిక్కర్ క్వీన్ వచ్చింది. కవిత ఐదేండ్లు ఎంపీ ఉన్నా చేసిందేమీ లేదు. అధికారంలోకి వస్తే బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఆ ఫ్యాక్టరీలను మూసి వేయించిన ఘనత కవితకే దక్కుతుంది” అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ తమ మార్గదర్శకుడని, కాంగ్రెస్ గురించి, రాహుల్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు.