జీవన్​రెడ్డి షాపింగ్​మాల్​ రీఓపెన్

జీవన్​రెడ్డి షాపింగ్​మాల్​ రీఓపెన్

నిజామాబాద్, వెలుగు : జీవన్​రెడ్డి షాపింగ్​ మాల్, మల్టిప్లెక్స్​ను సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం రీఓపెన్​ చేశారు. ఆర్మూర్ బస్టాండ్​ పక్కనున్న 7,059 గజాలను 2017లో  జీవన్​రెడ్డి లీజుకు తీసుకున్నారు. 33 ఏళ్ల కాలానికి బీవోటీ పద్ధతిలో లీజుకు తీసుకొని విష్ణుజిత్​ ఇన్​ఫ్రా డెవలపర్స్​ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.  సదరు ల్యాండ్​లో షాపింగ్​మాల్, మల్టిఫ్లెక్స్​ నిర్మించి థర్డ్​పార్టీకి లీజుకిచ్చారు.

అయితే ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ము ముట్టజెప్పకపోవడంతో రూ.2.51 కోట్ల వరకు బకాయిలు పెరిగాయి. వాటి వసూలుకు కఠినంగా వ్యవహరిస్తున్న సంస్థ అధికారులు ఈనెల 16న మాల్​కు తాళం వేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తిరిగి తెరిచేందుకు ధర్మాసనం అనుమతించింది.