ప్రపంచ తొలి ట్రిలినియర్ బెజోస్?

ప్రపంచ తొలి ట్రిలినియర్ బెజోస్?

న్యూయార్క్: భార్యతో విడాకులు.. విడాకుల వివాదంతో సగానికి పైగా ఆస్తిని కోల్పోయినా.. అమెజాన్‌‌ ఫౌండర్ జెఫ్ బెజోస్​ ప్రపంచంలో తొలి ట్రిలినియర్‌‌‌‌గా అవతరించబోతున్నారు. 2026 నాటికి ట్రిలినియర్​​ (మహా కోటీశ్వరుడు) బెజోస్ తొలి మెంబర్‌‌‌‌గా చోటు దక్కించుకోనున్నారని కంపారిజన్ చేసిన కొత్త​అధ్యయనంలో వెల్లడైంది. గత ఐదేళ్ల నుంచి అమెజాన్ ఫౌండర్ సంపద యావరేజ్‌‌గా 34 శాతం పెరిగినట్టు ఈ స్టడీ పేర్కొంది. కొత్త ప్రొడక్ట్స్‌‌ను మార్కెట్లోకి తీసుకొస్తూ.. తన వాల్యును అంతకంతకూ పెంచుకుంటోంది.   కంపారిజన్‌‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిచెస్ట్ కంపెనీల, ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 25 ధనికుల వాల్యుయేషన్‌‌ను అనాలసిస్ చేసింది. ఈ అనాలసిస్‌‌లో ట్రిలియన్ డాలర్‌‌‌‌ క్లబ్‌‌లో తొలుత చేరబోయేది ఎవరు..? వారు ఎప్పుడు ఈ క్లబ్‌‌లో చేరతారు? అనే విషయాలపై స్టడీ చేసింది. జెఫ్ బెజోస్ సంపద ప్రస్తుతం 143 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2026 నాటికి 1000 బిలియన్ డాలర్లకు పెరుగుతోందని, దీంతో 62 ఏళ్ల వయసులోనే తొలి ట్రిలినియర్​గా బెజోస్ పేరు తెచ్చుకోనున్నారని కంపారిజన్ స్టడీ పేర్కొంది. ఈ స్టడీలో బెజోస్ తర్వాత చైనీస్ రియల్ ఎస్టేట్ టైకూన్ షు జియాయిన్ రెండో స్థానాన్ని పొందనున్నారని పేర్కొంది. ముకేశ్ అంబానీ 2033 నాటికి ట్రిలినియర్ క్లబ్‌‌లో చోటు దక్కించుకోనున్నారని తెలిపింది. అలీబాబా జాక్‌‌మా 2030 నాటికి ట్రిలినీయర్‌‌‌‌గా అవతరించనున్నారు.

యువీ కిరణాలతో కరోనా వైరస్ కు చెక్