జెమీమా కు గ్రీన్‌‌ సిగ్నల్‌‌..డిసెంబర్‌‌ లో సౌతాఫ్రికాతో జరగనున్న టూర్‌‌ లో చోటు

జెమీమా కు గ్రీన్‌‌ సిగ్నల్‌‌..డిసెంబర్‌‌ లో సౌతాఫ్రికాతో జరగనున్న టూర్‌‌ లో చోటు

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌ జట్టు స్టార్‌‌ బ్యాటర్‌‌ జెమీమా రోడ్రిగ్స్‌‌.. కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకుంది. తాను పూర్తి ఫిట్‌‌నెస్‌‌ సాధించినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టులో ఇంగ్లండ్‌‌లో జరిగిన ‘ది హండ్రెడ్‌‌’ టోర్నీలో ఆడుతున్నప్పుడు జెమీమాకు గాయమైంది. తర్వాత చికిత్సతో పాటు మూడు నెలల పాటు రిహాబిలిటేషన్‌‌లో  కొనసాగింది. 

ఆ టైమ్‌‌లో జరిగిన టీ20 ఆసియా కప్‌‌, ఆసియా క్రీడల (జపాన్‌‌)కు దూరమైంది. ఇటీవల స్వదేశంలో జింబాబ్వేతో ముగిసిన వైట్‌‌బాల్‌‌ సిరీస్‌‌లోనూ ఆడలేకపోయింది. డిసెంబర్‌‌లో సౌతాఫ్రికాతో జరగనున్న టూర్‌‌తో జెమీమా మళ్లీ ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.