ధర తెలిస్తే షాక్ : జోర్డాన్‌‌ నది నీళ్లతో షూ తయారీ

ధర తెలిస్తే షాక్ : జోర్డాన్‌‌ నది నీళ్లతో షూ తయారీ

ఇవి మామూలు షూ కాదు. జీసస్​ అనుగ్రహం ఉన్న షూనట. అత్యంత పవిత్రమైనవట. బ్రూక్లిన్​కు చెందిన ఎంఎస్​సీహెచ్​ఎఫ్​ అనే సంస్థ నైకీ ఎయిర్​ మ్యాక్స్​ 97 షూలను జీసస్​ షూగా మార్చింది. వాటి సోల్​లో పవిత్రమైన జోర్డాన్​ నది నీళ్లను పోసి పెట్టింది. షూ లేస్​కు క్రీస్తు శిలువను తగిలించింది. అంతేకాదు, సోల్​కు కొంచెం పైన జీసస్​ నీళ్ల మీద నడిచాడు అని చెప్పే బైబిల్​లోని మాథ్యూ 14:25 అనే సూక్తినీ రాసింది. ఆ షూకు చర్చి ఫాస్టర్లతో ప్రత్యేక ప్రార్థనలూ చేయించింది.

ఓ రెండు డజన్ల షూలను మాత్రమే ఆ కంపెనీ తయారు చేసింది. అతి త్వరలోనే మరికొన్ని జతల షూలను తయారు చేస్తామని ఆ కంపెనీ ఓనర్​ గేబ్రియల్​ వేలీ చెప్పాడు. ఈ షూ ఖరీదు కూడా మామూలుగా లేదు. 3 వేల డాలర్లు. దాదాపు 2 లక్షల 12 వేల రూపాయలు.