జీతాలు ఇప్పించండి: రాష్ట్రపతికి జెట్ ఉద్యోగుల లేఖ

జీతాలు ఇప్పించండి: రాష్ట్రపతికి జెట్ ఉద్యోగుల లేఖ

అర్థాంతరంగా జెట్‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌ సేవలు ఆగిపోవడంతో, ఆ సంస్థ ఉద్యోగులు రాష్ట్రపతికి తమగోడును విలపించుకున్నారు. వేతన బకాయిలుచెల్లించేలా, ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌కు ఎమర్జెన్సీ ఫండింగ్‌‌‌‌‌‌‌‌ అందించేలా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరారు. నిధులలేమితో ఈ నెల 17న మూతపడిన జెట్‌ లో సుమారు 23వేల మంది ఉద్యోగులున్నారు. వీరి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, రెండు ఉద్యోగ సంఘాలు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాశాయి. తమ వేతన బకాయిలు క్లియర్ చేయాలని ఈ లేఖల్లో పేర్కొన్నాయి.

లేఖలు రాసిన ఉద్యోగ సంఘాల్లో సొసైటీ వెల్‌‌‌‌‌‌‌‌ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్(సీడబ్ల్ యూఐపీ), జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వెల్‌‌‌‌‌‌‌‌ఫేర్ అసోసియేషన్(జేఏఎంఈ-డబ్ల్ యూఏ) ఉన్నాయి. ప్రభావితమైన ఉద్యోగులందరి వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా జెట్ ఎయిర్‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌వేస్మేనేజ్‌ మెంట్‌ ను ఆదేశించాలని కోరాయి. అంతేకాక ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు ఎమర్జెన్సీ ఫండింగ్ అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నాయి. పైలెట్లు, ఇంజనీర్లకు జెట్​ ఇప్పటికి మూడు నెలల జీతాలు ఇవ్వాలని, మిగతా స్టాఫ్‌ కు ఒక నెల బాకీ పడిందని లేఖలో పేర్కొన్నాయి. అన్నిరకాల ప్రయత్నాల తర్వాత నమ్మకం కోల్పోయామని, ఇక మీరైనా కలుగజేసుకుని వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని యూనియన్లు కోరాయి.