
1 Crore Value in 2050: చాలా మంది ప్రస్తుతం కోటి రూపాయలు అనే మెుత్తాన్ని చాలా ఎక్కువగా భావిస్తుంటారు. ఒకప్పుడు లక్షాధికారి అంటేనే గొప్ప ఊళ్లల్లో.. కానీ ఇప్పుడు లక్షలు పోయి కోటీశ్వరులు వచ్చేశారు. స్థలాలు, పొలాల రేట్లు కూడా భారీగా పెరగటం.. చాలా మంది మధ్యతరగతి కుటుంబాల్లో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉండటం సమాజంలో ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచింది. దీంతో కోటీశ్వరుల కాలం నడుస్తోంది 2025లో. ఇక్కడి వరకు భాగానే ఉంది కానీ ఈ కోట్లకు భవిష్యత్తులో అసలు విలువ ఎంతనే విషయం తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం.
2025లో కోటి రూపాయలు కలిగి ఉండటం ఒక పెద్ద మెుత్తం. దీంతో పిల్లలను విదేశాల్లో చదివించటం నుంచి వారికి పెళ్లి చేయటం లేదా సొంతిల్లు కొనుక్కోవటానికి ఇది సరిపోవచ్చు. కానీ 25 ఏళ్ల తర్వాత 2050లో ఇప్పుడు మీరు కలిగి ఉన్న కోటిరూపాయలకు విలువ కేవలం రూ.29లక్షల 53వేలని మీకు తెలుసా. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కాలానుగుణంగా డబ్బు దాని కొనుగోలు శక్తిని కోల్పోతుందని అందువల్లనే ఇప్పటి డబ్బు భవిష్యత్తులో విలువ కోల్పోవటానికి కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ సగటు ద్రవ్యోల్బణం రేటును 5 శాతం వద్ద లెక్కింపుకు తీసుకోబడింది. వాస్తవంగా ఇది ఇంకా ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉంది.
ALSO READ : సరికొత్త రికార్డులకు బిట్‌కాయిన్..
అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే.. ఈరోజు కోటి రూపాయలతో మీరు ఏమేమి కొనగలరో.. అవే వస్తువులను లేదా సేవలను 2050లో పొందటానికి భారతీయులు రూ.3కోట్ల 40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అందుకే ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడి పొందేలా పెట్టుబడులు చేయగలిగితేనే మీ డబ్బుకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది. దీనికోసం సరైన ఆర్థిక ప్రణాళికలు చాలా ముఖ్యం. చెదపురుగులు చెక్కను తినేసినట్లుగానే.. ద్రవ్యోల్బణం కూడా డబ్బు విలువను కాలానుగుణంగా తినేస్తుందని గమనించాలి ప్రతి ఒక్కరు.