Venky77: TFI ఆడియన్స్ వెయిటింగ్ ఓవర్.. త్రివిక్రమ్, వెంకీ ప్రాజెక్ట్ అనౌన్స్

Venky77: TFI ఆడియన్స్ వెయిటింగ్ ఓవర్.. త్రివిక్రమ్, వెంకీ ప్రాజెక్ట్ అనౌన్స్

వెంకటేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్పై అప్డేట్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే (ఆగస్ట్ 15) సందర్భంగా మూవీ సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

లేటెస్ట్గా ఇందుకు సంబంధించిన ఫోటోలను హీరో విక్టరీ వెంకటేష్ పంచుకున్నారు. పూజా కార్యక్రమం హైదరాబాద్లో సింపుల్‌గా జరిగింది. నిర్మాతలు చిన్నబాబు (ఎస్ రాధా కృష్ణ), సురేష్ బాబు, నాగ వంశీ ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధా కృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Also read:-ఈ హీరోయిన్ ఉండేది అద్దె ఇంట్లో.. ఏకంగా రూ.78 కోట్లుపెట్టి లగ్జరీ విల్లానే కొనేసింది!

కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునేలా త్రివిక్రమ్ తనదైన శైలిలో కథారచనా చేసినట్లు టాక్. ఈ సినిమాకు ‘వెంకటరమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. 

వెంకీ-త్రివిక్రమ్:

నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరీ సినిమాలు విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లోఎప్పుడు ముందుంటాయి. ఈ సూపర్ హిట్ సినిమాలకు కథ అందించి, మాటలు రాసింది మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తీసుకురావడంలో త్రివిక్రమ్ హస్తం ఉంది.

ఇప్పటికీ, ఈ సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ టీవీలో వచ్చినా మిస్ అవకుండా చూసేవాళ్లు చాలా ఉండే ఉన్నారు. అంతలా ఆడియన్స్ మనసులను హత్తుకున్నాయి ఈ సినిమాలు. అయితే దాదాపు 23 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ కాంబో కలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.