సికింద్రాబాద్, వెలుగు : జ్యువెలరీ షాపులో పనిచేసే వర్కర్షాప్ఓనర్కు మస్కా కొట్టి 650 గ్రాముల బంగారు ఆభరణాలు కొట్టేశాడు. నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన దినేశ్(18), మహేందర్లోహర్(24), ప్రవీణ్‌కుమార్(21), భవానిగిరి(21), ఉమేశ్(21) ఫ్రెండ్స్. వీళ్లు ఐదుగురు అల్వాల్‌లో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. దినేశ్ పాట్మార్కెట్లోని శాంతినాథ్జ్యువెలరీ షాపులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. షాపులో తయారు చేసిన ఆభరణాలను సిటీలోని వేర్వేరు గోల్డ్షాపులకు తీసుకెళ్లి చూపిస్తుంటారు.
ఎప్పటిలాగే ఈ నెల 18న దినేశ్ 850 గ్రాముల బంగారు ఆభరణాలను బైక్‌పై తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో కొందరు అతన్ని అడ్డగించి నగల బ్యాగును లాక్కొనిపోయారు. విషయం తెలుసుకున్న శాంతినాథ్ జ్యువెలరీ యజమాని మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దినేశ్ ద్వారా చోరీ జరిగిన తీరును తెలుసుకున్నారు. అతనిపై అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దినేశ్గౌలిగూడలో పనిచేసే తన రూమ్మేట్స్మహేందర్, ప్రవీణ్‌కుమార్, భవానీగిరి, ఉమేశ్‌తో కలిసి చోరీ చేసినట్లు గుర్తించారు.
దినేశ్ మినహా నలుగురు యువకులు దోచుకున్న నగల్లో కొన్ని విజయవాడలో విక్రయించి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు శనివారం అల్వాల్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి 650 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
