సాధారణంగా ఫ్రెండ్షిప్ సినిమాలు అంటే ఈ కాలంలో కాస్త 'బోల్డ్' కంటెంట్, మరీ ఎక్కువ 'బూతులు' ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ, స్వచ్ఛమైన వినోదంతో.. కడుపుబ్బ నవ్వించే కామెడీతో ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ‘జిగ్రీస్’ (Jigris). థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT) ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాపై ఎగబడుతున్నారు.
హరీష్ రెడ్డి ఉప్పుల మ్యాజిక్
ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద బలం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సపోర్ట్. కంటెంట్ ఉన్న సినిమాను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల తన మొదటి సినిమానే ఎంతో అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తీర్చిదిద్దారు. ఎక్కడా అసభ్యత లేకుండా, నలుగురు స్నేహితుల మధ్య సాగే ప్రయాణాన్ని ఆసక్తికరంగా మలిచారు. పక్కా లోకల్ కామెడీని ఎమోషన్స్‌తో జోడించి, ప్రతి సీన్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు.
కృష్ణ బురుగుల వన్ మ్యాన్ షో!
సినిమాకు వెన్నెముకగా నిలిచింది కృష్ణ బురుగుల. ఆయన కామెడీ టైమింగ్ చూస్తుంటే ప్రేక్షకులు నోరు మూసుకోలేనంతగా నవ్వుకుంటున్నారు. కేవలం నవ్వించడమే కాదు, క్లైమాక్స్ , ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ పాత్రల్లో జీవించారు. నలుగురు మిత్రుల మధ్య ఉండే బాండింగ్ ప్రతి ఒక్కరికీ తమ సొంత స్నేహితులను గుర్తు చేస్తుంది.
నిర్మాత కృష్ణ వోడపల్లి, సహ నిర్మాత చిత్తం వినయ్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ చిత్రాన్ని అందించారు. సయ్యద్ కమ్రాన్ సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేయగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నవ్వులకు మరింత బలాన్ని ఇచ్చింది. ఈశ్వరదిత్య డీవోపీ సినిమాకు మంచి కలర్ ఫుల్ లుక్ ఇవ్వగా, చాణక్య రెడ్డి తూరుపు షార్ప్ ఎడిటింగ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను పరుగులు పెట్టించింది.
ఫ్యామిలీ ఆడియన్స్ నీరాజనాలు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఈ సినిమా క్లిప్పింగ్స్ మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అవుతున్నాయి. వల్గారిటీ లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఒక వీకెండ్‌లో సరదాగా చూసే సినిమాగా 'జిగ్రీస్' నిలిచింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డ్ వ్యూస్ సాధిస్తున్న ఈ చిత్రం, యువతకు ఒక 'కల్ట్' ఫ్రెండ్షిప్ మూవీగా మారిపోయింది. మీరు ఇంకా ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ని చూడకపోతే, వెంటనే అమెజాన్ ప్రైమ్ లేదా సన్ నెక్స్ట్ లో చూసేయండి. కచ్చితంగా ఇది మీ మనసును గెలుచుకుంటుందంటున్నారు మేకర్స్..
