జియో సెలబ్రేషన్ రీచార్జ్ ప్లాన్..రోజుకు 5జీబీ డేటా

జియో సెలబ్రేషన్ రీచార్జ్ ప్లాన్..రోజుకు 5జీబీ డేటా
  • సెలబ్రేషన్ ప్లాన్‌‌‌‌ను ప్రకటించిన జియో

హైదరాబాద్​, వెలుగు: జియో ఇటీవల 50 కోట్ల కస్టమర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా రూ. 349 సెలబ్రేషన్ ప్లాన్‌‌‌‌ను ప్రకటించింది. ఇది సెప్టెంబర్ నెల మొత్తం అందుబాటులో ఉండే  ప్రత్యేక ఆఫర్. 

ఇందులో  అన్‌‌‌‌లిమిటెడ్ 5జీ డేటా, అన్‌‌‌‌లిమిటెడ్ వాయిస్ కాల్స్,  రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు లభిస్తాయి. ప్లాన్​ వ్యాలిడిటీ 28 రోజులు.  జియోటీవీ, జియోసినిమా,  జియోక్లౌడ్ యాప్‌‌‌‌లకు ఉచిత యాక్సెస్ ఇస్తారు.

 రూ. 3,000 విలువైన జియోహాట్‌‌‌‌స్టార్, ఒక నెల జియో సావన్ ప్రో, 3 నెలల జొమాటో గోల్డ్ మెంబర్షిప్​, 6 నెలల నెట్​మెడ్స్​ ఫస్ట్ సబ్‌‌‌‌స్క్రిప్షన్​ కూడా ఇస్తారు.  ఈ నెల ఏడో తేదీ వరకు అందరు జియో కస్టమర్లకు అన్‌‌‌‌లిమిటెడ్ డేటా లభిస్తుంది.