వినియోగ‌దారుల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్.. ఏడాది పాటు

వినియోగ‌దారుల‌కు జియో బంప‌ర్ ఆఫ‌ర్.. ఏడాది పాటు

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో రెండు కొత్త ప్లాన్‌లను విడుదల చేసింది. రూ.499 మరియు రూ.777 ల‌తో ఒక సంవత్సరం పాటు కాంప్లిమెంటరీ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్రీయ‌మంను అందిస్తుంది. దీంతో జ‌ర‌గ‌బోయే ఐపీఎల్ ను డిస్నీ + హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చు.

* నిజామాబాద్ లో దారుణం.. యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్

* ఆస్పత్రిలో కన్నుమూసి.. అంత్యక్రియల్లో కళ్లు తెరిచింది

* పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

రిలయన్స్ జియో రూ . 499 క్రికెట్ ప్లాన్

రూ .499 క్రికెట్ ప్లాన్ కింద, జియో తన వినియోగదారులకు రోజువారీ 1.5 జీబీ హైస్పీడ్ డేటాను 56 రోజులు అందిస్తోంది.ఐపీఎల్ సీజ‌న్ మొత్తం ఈ ప్లాన్ వినియోగదారులకు ఎటువంటి కాలింగ్ లేదా ఎస్ ఎంఎస్ సౌక‌ర్యాన్ని పొంద‌లేరు. కొత్త ప్లాన్ రూ. 399తో డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీ ప్రీమియంను సొంతం చేసుకోవ‌చ్చు.

రిలయన్స్ జియో రూ. 777 క్రికెట్ ప్లాన్

జియో రూ. 777 ప్లాన్ కింద 5 జీబీ అదనపు డేటాతో 1.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటాను తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత జియో నుండి జియో కాల్ చేసుకోవ‌డంతో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 నిమిషాలు మరియు రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌లను సెండ్ చేసుకోవ‌చ్చు.

ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ‌ర్తిస్తుంది రూ .499 ప్లాన్ మాదిరిగానే, ఇది కూడా ఒక సంవత్సరానికి డిస్నీ + హాట్ స్టార్ వీఐపీ చందాను సొంతం చేసుకోవ‌చ్చు.