చేనేత కార్మికుల కోసం జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ మేళా

చేనేత కార్మికుల కోసం జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ మేళా

చేనేత  కార్మికులు, కళాకారులకు సాయం చేసేందుకు  జియో మార్ట్‌‌‌‌‌‌‌‌ ‘క్రాఫ్ట్స్ మేళా’ ను ఈ నెల 17 నుంచి 19 వరకు నిర్వహిస్తోంది. వీరు తయారు చేసిన  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను జియోమార్ట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లో ప్రమోట్ చేయనుంది. క్రాఫ్ట్స్ మేళాతో  10 వేల మందికి పైగా కళాకారులు, చేనేత కార్మికులు లబ్ధి పొందుతారని రిలయన్స్ రిటైల్‌‌‌‌‌‌‌‌కు చెందిన జియోమార్ట్ పేర్కొంది. కస్టమర్లు చేతితో చేసిన 85 వేలకు పైగా ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను కొనుక్కోవచ్చని వెల్లడించింది. మొత్తం 22 రాష్ట్రాలు, యూటీలకు చెందిన కళాకారులు, చేనేత కార్మికులకు  సాయంగా ఈ మేళాను నిర్వహిస్తున్నామని వివరించింది.