Jio Recharge: హమ్మయ్య.. ఇప్పటికైనా జియో గుడ్ న్యూస్ చెప్పింది.. కస్టమర్లు పండగ చేస్కోండి..

Jio Recharge: హమ్మయ్య.. ఇప్పటికైనా జియో గుడ్ న్యూస్ చెప్పింది.. కస్టమర్లు పండగ చేస్కోండి..

అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేసి టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పుకు కారణమైన రిలయన్స్ జియో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఎంటర్టైన్మెంట్ ఓటీటీ యాప్స్కు విపరీతమైన ఆదరణ ఉన్న ఈ తరుణంలో రిలయన్స్ జియో 200 రూపాయల లోపే ఓటీటీ ప్లాన్ను తీసుకొచ్చింది. 200 రూపాయల లోపే 12 ఓటీటీ యాప్స్ను సబ్స్క్రిప్షన్ చేసుకునే ప్లాన్ను తీసుకొచ్చింది. 175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్తో 12 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుని 28 రోజుల పాటు ఆస్వాదించవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్లో భాగంగా 10 జీబీ హై స్పీడ్ డేటా కూడా పొందొచ్చు. ఎలాంటి డైలీ లిమిట్ లేకుండా ఈ 10 జీబీ డేటాను వాడుకోవచ్చు. 

ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే జియో కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ఇది కేవలం డేటా బెన్ఫిట్స్, ఓటీటీ బెన్ఫిట్స్తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో కాలింగ్ సేవలు ఉండవు. వాయిస్ కాల్స్ కావాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ ను తీసుకురాలేదు. ఓటీటీలో వినోదాన్ని ఆస్వాదించే వారి కోసం మాత్రమే ఈ 175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇతర రీఛార్జ్ ప్లాన్స్ లో కొనసాగుతున్న జియో యూజర్లు కూడా ఓటీటీ సేవలు కావాలంటే ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకోవచ్చు. 

సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్ఎక్స్టి, కాంచ లంక, ప్లానెట్ మరాఠీ,చౌపల్, డాకుబే, ఎపిక్ ఆన్, హోయ్ చొయ్ ఓటీటీ యాప్స్ సేవలను 175 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో 28 రోజుల పాటు ఆస్వాదించవచ్చు. ఇక.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సోనీ లివ్, జీ5 ఓటీటీ యాప్స్ లో బోలెడన్ని తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. సోనీ లివ్లో ఇటీవల త్రిష నటించిన బృంద వెబ్ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి వెబ్ సిరీస్, సినిమా కంటెంట్ చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి జియో తీసుకొచ్చిన ఈ 175 ప్లాన్ బాగానే పనికొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు