రూ.100 కోట్లతో సంస్థను విస్తరిస్తాం : జితేంద్ర కర్సన్

రూ.100 కోట్లతో సంస్థను విస్తరిస్తాం : జితేంద్ర కర్సన్

 హైదరాబాద్​, వెలుగు: రాబోయే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా తమ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని చిల్డ్రన్​ఎడ్యుకేషన్​లో అంతర్జాతీయ బ్రాండ్ అయిన సఫారీ కిడ్ ప్రీస్కూల్, డేకేర్ చైర్మన్​ జితేంద్ర కర్సన్​తెలిపారు. 

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫైనాన్షియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ డిస్ట్రిక్ట్​లో ప్రీస్కూల్, డే కేర్​ సెంటర్​ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది వరకే తమకు ముంబైలో ఒక స్కూలు ఉందని, రాబోయే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2005లో సిలికాన్ వ్యాలీలో ప్రారంభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన సఫారీ కిడ్ అమెరికా, కెనడా, ఇండియా తదితర దేశాల్లో 50కి సెంటర్లు ఉన్నాయి.