బీజేపీ నుంచి మానసికంగా ఎప్పుడో దూరమయ్యాను:జిట్టా బాలక్రిష్ణారెడ్డి

బీజేపీ నుంచి మానసికంగా ఎప్పుడో దూరమయ్యాను:జిట్టా బాలక్రిష్ణారెడ్డి

యాదాద్రి, వెలుగు: బీజేపీకి తాను మానసికంగా ఎప్పుడో దూరమయ్యాయని బీజేపీ నేత జిట్టా బాలక్రిష్ణారెడ్డి చెప్పారు. కాంగ్రెస్​ నుంచి తనకు ఆహ్వానం అందిందని, అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయనే బీజేపీలో చేరానని గుర్తుచేశారు.

ALSO READ :తెలంగాణకు అతి భారీ వర్ష సూచన....ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్...

కానీ, తాను కార్యకర్తగా మాత్రమే ఆ పార్టీలో ఉన్నానని, మానసికంగా ఎప్పుడో దూరం అయ్యానని తెలిపారు. అన్ని పార్టీల కంటే బీజేపీలోనే గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయ న్నారు. సామాన్య కార్యకర్తగా వచ్చి, కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన  బండి సంజయ్​ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు.