మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే సపోర్ట్ : దుష్యంత్

మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే సపోర్ట్ : దుష్యంత్

హర్యానాలో హంగ్ నేపథ్యంలో అందరి దృష్టి జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)పై పడింది. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ మద్దతు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. అయితే  ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా. ఎటువంటి చర్చలు కూడా జరగలేదన్నారు. తమ పార్టీ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్(CMP) కు మద్దతిచ్చిన వారికే తాము తాము మద్దతిస్తామన్నారు. అందులో ముఖ్యంగా  యువతకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు, వృద్ధాప్య పింఛన్లు వంట ిపలు అంశాలున్నాయన్నారు. కాంగ్రెస్,బీజేపీలు తమకు అంటరానివి కావన్నారు.