స్టూడెంట్లు పట్టుదలతో లక్ష్యం చేరాలి : కట్టా నర్సింహారెడ్డి

స్టూడెంట్లు పట్టుదలతో లక్ష్యం చేరాలి : కట్టా నర్సింహారెడ్డి
  • జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి 

జేఎన్టీయూ, వెలుగు : స్టూడెంట్లు పట్టుదలతో  తమ లక్ష్యం చేరుకోవాలని జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి సూచించారు. కూకట్​పల్లి క్యాంపస్​లో చేరిన ఫస్టియర్ స్టూడెంట్లకు సోమవారం సాయంత్రం వర్సిటీలోని ఆడిటోరియంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. వర్సిటీలో పలు రకాల క్లబ్​లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం

 చేసుకుని ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, రెక్టార్ గోవర్ధన్, వైస్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి , సీఆర్సీ చైర్మన్ పార్వతి, స్టూడెంట్ల తల్లితండ్రులు పాల్గొన్నారు.