ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బంపరాఫర్.. బ్యాక్ లాగ్స్ కంప్లీట్ కు ఒకే ఒక్క ఛాన్స్

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బంపరాఫర్.. బ్యాక్ లాగ్స్ కంప్లీట్ కు ఒకే ఒక్క ఛాన్స్

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు  జేఎన్టీయూ గుడ్ న్యూస్.  చాలా  కాలంగా పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్  సబ్జెక్టులను క్లియర్ చేయడానికి ఒక అవకాశం కల్పిస్తుంది జేఎన్టీయూ. బ్యాక్ లాగ్ క్లియర్ చేయాలనుకునే స్టూడెంట్స్   కోసం అక్టోబర్ లేదా నవంబర్ లో  ప్రత్యేకంగా సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనుంది. బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను క్లియర్ చేయడానికి రెండేళ్ల  అదనపు సమయం తీసుకుని సబ్జెక్టులను క్లియర్ చేయలేని అభ్యర్థులకు ఇది చివరి అవకాశం. 

BTech (Reg.), BTech (CCC), BTech (PTDC), BTech (FDH), BPharmacy, MTech (Reg.), MTech (PTPG), MTech (SSS), MTech (CCC), MScలో ప్రవేశం పొందిన అభ్యర్థులు (Reg.), MSc (పార్ట్ టైమ్), MBA (Reg.), MBA (పార్ట్ టైమ్), MCA (Reg.), MoU ,  ఇతర UG, PG కోర్సులు వారు బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను క్లియర్ చేసుకోవచ్చు.

ALSO READ :ఇలా చేస్తే పదేళ్లలో కోటీశ్వరులే..

ఎగ్జామ్ ఫీజును   అక్టోబర్ 4 - 13 మధ్య సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చు.  రూ.100 ఫైన్ తో  అక్టోబర్ 14 నుంచి 20 వరకు,  రూ.1000 ఫైన్ తో అక్టోబర్ 21 నుంచి 30 మధ్య  కట్టుకోవచ్చు. రూ. 2వేల ఫైన్ తో  అక్టోబర్ 31  నుంచి  నవంబర్ 3వరకు,  రూ.5వేల ఫైన్ తో నవంబర్ 4 నుంచి  8 మధ్య  చెల్లించవచ్చు.