
JNTUలో బీటెక్ విద్యార్ధులకు స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 2022--23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టనున్నారు. విద్యార్థుల వినతి మేరకు JNTUH అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులకు స్పెషల్ సప్లిమెంటరీ పరీక్ష కోసం జెఏన్టీయూ ప్రత్యేకంగా సమావేశమైంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ Dr కట్టా నర్సింహా రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. స్పెషల్ సప్లిమెంటరీ కొరకు విద్యార్థులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. బీటెక్ 2022--23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాసిన విద్యార్థులందరికి ఇది వర్తిస్తుంది.
B.Tech లో ఏవేని ఐదు సబ్జెక్టులు పరీక్ష వ్రాసుకునే అవకాశం కలిపిస్తూ జేఎన్టీయూ హెచ్ ప్రకటన చేసింది. థియరీ, ల్యాబ్, కాంప్రహెన్సీవ్ వైవాస్, సెమినార్, ప్రాజెక్టు వైవాస్ పరీక్షలు రాసుకోవచ్చని సూచించింది.
స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షకు మరిన్ని వివరాలకోసం JNTUH website ను సందర్శించాల్సింది విద్యార్థులకు పరీక్షలు విభాగం అధికారి డైరెక్టర్ Dr k. వెంకటేశ్వరరావు తెపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యూనివర్సిటీ రిజిస్టర్ Dr హుసేన్ కోరారు.