కలియుగం పట్టణంలో మూవీ నుండి జో జో లాలీ అమ్మ సాంగ్ రిలీజ్

కలియుగం పట్టణంలో మూవీ నుండి జో జో లాలీ అమ్మ సాంగ్ రిలీజ్

చిత్రా శుక్లా ప్రధానపాత్రలో, విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డా. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘జో జో లాలీ అమ్మ’ అంటూ సాగే మదర్ సెంటిమెంట్‌‌‌‌పాటను దర్శకుడు వశిష్ట విడుదల చేసి టీమ్‌‌‌‌ కు బెస్ట్ విషెస్ చెప్పాడు. అజయ్ అరసాద కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా,  అనురాగ్ కులకర్ణి పాడాడు. మార్చి 22న సినిమా విడుదల కానుంది.