ఏం క్రియేటివిటీ బాసూ.. సోషల్ మీడియాను ఊపేస్తున్న నిరుద్యోగి రెజ్యూమ్.. ఇతడి క్రియేటివిటీకి జాబ్ పక్కా !

ఏం క్రియేటివిటీ బాసూ..  సోషల్ మీడియాను ఊపేస్తున్న నిరుద్యోగి రెజ్యూమ్.. ఇతడి క్రియేటివిటీకి జాబ్ పక్కా !

ఒక్క జాబ్ కు వేలు.. లక్షల మంది పోటీ పడే రోజుల్లో.. ఉద్యోగం సంపాదించడం పెద్ద టాస్క్. నిత్యం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. మెటీరియల్స్ తో కుస్తీ పడుతూ.. ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకునేలోపే.. కొత్త కొత్త అప్ డేట్స్.. అప్ గ్రేడ్లతో సాప్ట్ వేర్ లాంటి ప్రైవేట్ ఫీల్డ్స్.. నిరుద్యోగులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తుంటాయి. ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవడం చేత వచ్చిన ఫ్రస్ట్రేషనో ఏదో కానీ.. ఒక నిరుద్యోగి తయారు చేసిన రెజ్యూమ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

జాబ్ హంటింగ్ లో సబ్జెక్ట్ తో పాటు క్రియేటివిటీ చూపాలని అనుకున్నట్లుంది ఒక నిరుద్యోగి. అతడు చేసిన పనికి సోషల్ మీడియాలో మీమ్స్.. కామెంట్లు.. ఒక డిబేటే నడుస్తోంది. రెడిట్ లో ప్రత్యక్షమైన రెజ్యూమ్.. ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. రెజ్యూమ్ ను పూర్తిగా ప్రింట్ చేయకుండా.. సగం ఫోటో, సగం వివరాలతో ప్రింట్ చేసి రెడిట్ లో పోస్ట్ చేశాడు ఈ యువకుడు. ఆ సగం ప్రింటెడ్ రెజ్యూమ్ కింద రాసిన నోట్ ఇప్పుడు అందరినీ నవ్వేలా చేసింది. 

సగం రెజ్యూమ్ ప్రింట్ చేసిన నిరుద్యోగి.. తన పూర్తి పొటెన్షియల్ ఏంటో చూడాలంటే ఉద్యోగం ఇవ్వాలని రాయటం అటెన్షన్ గ్యాదర్ చేసింది. ఆ అప్లికెంట్ ఫేస్ తో పాటు, కెరీర్, ఆబ్జెక్టివ్స్ కు సంబంధించిన మ్యాటర్ కొంత మాత్రమే ప్రింట్ చేశాడు. తర్వాత ఆ పేజీ అంతా ఖాళీగా వదిలేసి.. చివర్లో.. ‘‘నా సామర్థ్యం బయపెట్టాలంటే నన్ను ఉద్యోగంలోకి తీసుకోండి’’ (Hire me to unlock my full potential) అని రాశాడు. 

Also Read  :రైల్వే ట్రాక్ పై ఏనుగు ప్రసవం.. రెండు గంటలు రైలు నిలిపివేత

రెజ్యూమ్ పైన కెరీర్ ఆబ్జెక్టివ్స్ లో భాగంగా ..‘‘ మీ కంపెనీలో భాగస్వామ్యం లభిస్తే.. నా నాలెడ్జ్ ను మరింత పెంచుకుని.. కెరీర్ డెవలప్ చేసుకుంటూ కంపెనీ అభివృద్ధిలో పాటు పడతా..’’ అనే జనరల్ డిస్క్రిప్షన్ రాశాడు. ఆ తర్వాత అర్హత (Qualification), అనుభవం (Experience) ను చెప్పకుండా  బ్లాంక్ గా వదిలేశాడు. ఫుల్ పొటెన్షిలయ్ అన్లాక్ కావాలంటే జాబ్ ఇచ్చి చూడండి అనే ట్యాగ్ లైన్ తో ప్రింట్ చేసి పోస్ట్ చేశాడు. 

సోషల్ మీడియాలో డిబేట్:

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది. ‘‘ప్రింటర్ సగం వరకు ప్రింట్ చేసి.. మిగతా ప్రింట్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు ఆగిపోయినట్లుంది..’’ అని ఒకరు ఫన్నీ కామెంట్ చేశారు. ‘‘మీకు కంపెనీ రిప్లై కింద ఈమెయిల్ పంపిస్తుంది.. కానీ..జాబ్ వచ్చే ఛాన్స్ మాత్రం 0.01% ఉంద’’ని మరొకరు కామెంట్ చేశారు.

‘‘నా జీవితంలో చూసిన అత్యంత తెలివైన విషయం ఏదైనా ఉందా అంటే ఇదే.. ఈ విషయం చెప్పడానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘నేనే రిక్రూటర్ అయ్యుంటే.. 100 శాతం పక్కాగా మీకు ఇంటర్వ్యూ కాల్ ఇచ్చేవాడిని. జాబ్ ఇవ్వకపోవచ్చు.. కానీ నా ఆఫీస్ కు వచ్చేందుకు నీకు అవకాశం ఉండేది’’ అంటూ మరోకరు రిప్లై ఇచ్చారు. కామెంట్స్ రిప్లైలతో ఈ హాఫ్ ప్రింటెడ్ రెజ్యూమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.