రైల్వే ట్రాక్ పై ఏనుగు ప్రసవం.. రెండు గంటలు రైలు నిలిపివేత

రైల్వే ట్రాక్ పై ఏనుగు ప్రసవం..  రెండు గంటలు రైలు నిలిపివేత
  •    జార్ఖండ్​లో జరిగిన ఘటనను ‘ఎక్స్’ లో షేర్ చేసిన కేంద్ర మంత్రి

రాంచీ: ఓ ఏనుగు రైల్వే ట్రాక్​పై ప్రసవించడంతో ఆ మార్గంలో వెళ్లే రైలు రెండు గంటల పాటు నిలిచిపోయింది. జార్ఖండ్​లో జరిగిన ఈ ఘటన కెమెరాల్లో రికార్డు అయింది. అందుకు సంబంధించిన వీడియోను కేంద్ర  పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​‘ఎక్స్’లో షేర్ చేశారు. 

గర్భంతో ఉన్న ఓ ఏనుగు రైల్వే ట్రాక్​పై ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో రైలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును వారు వెంటనే ఆపేశారు. దాదాపు రెండు గంటల పాటూ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైనే రైలు నిలిచిపోయింది. సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  

‘‘మానవ–-జంతు ఘర్షణల వార్తలకు అతీతంగా ఈ ఘటనను మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఏనుగు తన బిడ్డకు జన్మనిస్తుండటంతో జార్ఖండ్ లో ఓ రైలును రెండు గంటల పాటు నిలిపేశారు. ఏనుగు ప్రసవించడానికి సహకరించిన జార్ఖండ్ అటవీ అధికారులకు ప్రత్యేక అభినందనలు” అని పేర్కొన్నారు.