
ఆన్‌లైన్ మనీ పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ కోసం మాత్రమే పని చేస్తున్న గూగుల్ పే త్వరలో మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. యాప్‌లో జాబ్స్ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టబోతోంది. అలాగని ఇది గూగుల్ సెర్చ్‌లాగా అన్ని జాబ్‌ల గురించిన వివరాలు అందించదు. దేశంలోని పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్ ఆ సంస్థలకు చెందిన జాబ్ వివరాల్ని యాప్‌లో అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇవి ఎంట్రీ లెవల్ జాబ్స్ మాత్రమే అని గూగుల్ తెలిపింది.
‘స్విగ్గీ, డంజో, ఫ్యాబ్ హోటల్స్’ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్ వాటికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లను యాప్‌లో అందిస్తుంది. డెలివరీ బాయ్స్, రిటైల్ స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమ ప్రిఫరెన్స్‌కు అనుగుణంగా జాబ్ నోటిఫికేషన్స్‌ను సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సర్వీస్ ఢిల్లీలో అందుబాటులో ఉన్నప్పటికీ, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.