వికారాబాద్, వెలుగు: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌లోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ నెల 7న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అపోలో ఫార్మసీలో సుమారు 100కు పైగా పోస్టులు (ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, అప్రెంటిస్‌షిప్) వికారాబాద్, హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్నాయన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మా, డీ-ఫార్మా, ఎం-ఫార్మసీ విద్యార్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్‌ను 9676047444 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
