లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

పంజాగుట్ట, వెలుగు: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో  హరిహర కళా భవన్ వేదికగా​ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ వడ్నాల ప్రభాకర్ వెల్లడించారు. 

నైపుణ్యం ఉండి కూడా సరైన మార్గదర్శకత్వం లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న యువత కోసం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు, లయన్ డాక్టర్ జి. బాబురావు సహా 30 మంది నిపుణులతో ప్రత్యేక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశామన్నారు.