శంషాబాద్‌లో జాబ్ మేళా

శంషాబాద్‌లో జాబ్ మేళా

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్బీనగర్‌‌లో త్రినేత్ర ఫౌండేషన్ అధ్యక్షురాలు మడపతి పరమేశ్వరి నరేందర్ ఆధ్వర్యంలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకుడు సంగప్ప హాజరయ్యారు.  ఉద్యోగం సాధించిన పలువురికి జేడీ లక్ష్మినారాయణ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరు సమాజ సేవకు కృషి చేయాలన్నారు.

 త్రినేత్ర ఫౌండేషన్‌కు మీకు వచ్చే జీతం నుంచి ప్రతినెల రూ. 50 ఇవ్వాలని కోరారు.  600 మంది జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 300 మందికి  ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి.  కార్యక్రమంలో  మడపతి పరమేశ్వరి నరేందర్, బీజేపీ నాయకులు, సంగప్ప, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ ప్రేమ్ రాజ్‌, మడ పతి విజయమ్మ కుటుంబ సభ్యులు లాయర్ దినేశ్ పాటిల్,  శ్రీకాంత్, హైందవి, పాల్గొన్నారు.