హైదరాబాద్ ECIL లో జాబ్స్.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ ఇంటర్వూనే.. ఆగస్టు 11 లాస్ట్ డేట్

హైదరాబాద్ ECIL లో జాబ్స్.. ఎగ్జామ్ లేదు.. డైరెక్ట్ ఇంటర్వూనే.. ఆగస్టు 11 లాస్ట్ డేట్

హైదరాబాద్​లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్) సీఎస్ ట్రైనీ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 11. 
 

పోస్టులు: సీఎస్ ట్రైనీ 

ఎలిజిబిలిటీ: ఐసీఎస్ఐ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్​లో  ఉత్తీర్ణతతోపాటు నెల రోజులపాటు ఎగ్జిక్యూటివ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్(ఈడీపీ) పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్​బీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 11. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక: సీఎల్​డీసీ, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్ రోడ్డు, ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్. పూర్తి వివరాలకు ecil.co.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | MBA చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. MAT నోటిఫికేషన్ విడుదలైంది.. డీటైల్స్ ఇవే