
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) సెప్టెంబర్ సీజన్ షెడ్యూల్‌ను ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ, అడ్మిషన్స్ సమయానికి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మ్యాట్ స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా 600కు పైగా బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్ కల్పిస్తాయి.
దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్). ఈ ఎగ్జామ్‌ను 1988 నుంచి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహిస్తున్నది. 2003లో కేంద్ర విద్యాశాఖ మ్యాట్ ఎగ్జామ్‌ను జాతీయ స్థాయి పరీక్షగా గుర్తించింది. ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మ్యాట్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ రాయవచ్చు. ఏడాదిపాటు స్కోర్ వ్యాలిడిటీ ఉంటుంది.
ప్రస్తుతం సెప్టెంబర్ షెడ్యూల్‌ను ఏఐఎంఏ విడుదల చేసింది. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఇతర వివరాలను తెలుసుకుందాం.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు. కానీ, ప్రవేశాల సమయానికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి లేదు.
ఎగ్జామ్ విధానం
పేపర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా పేపర్ బేస్డ్+ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పీబీటీ+సీబీటీ) రెండింటినీ అభ్యర్థులు రాయవచ్చు. ఏదైనా ఒక టెస్ట్ రాయాలనుకుంటే ఎగ్జామ్ ఫీజు రూ.2200 చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా రూ. 1600 చెల్లించి పీబీటీ, సీబీటీ రెండూ కూడా రాయవచ్చు. ఒకే ఎగ్జామ్ రాసే అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఐదింటికి తమ స్కోర్ కార్డును పంపించవచ్చు. పీబీటీ, సీబీటీ రెండూ రాసే అభ్యర్థులు అదనంగా మరో రెండు బిజినెస్ స్కూళ్లకు తమ స్కోర్ కార్డులను పంపించడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: పేపర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు రూ.2200. పీబీటీ+సీబీటీకి 3800.
ఎగ్జామ్ సిలబస్
మ్యాట్ ఎగ్జామ్‌లో బిజినెస్ స్టడీస్తోపాటు వివిధ నైపుణ్యాలపై ప్రశ్నలు అడుగుతారు.
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్
ఒకాబులరీ: పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు, జాతీయాలు.
గ్రామర్: వాక్యాల దిద్దుబాటు, దోషాల గుర్తింపు.
రీడింగ్ కాంప్రహెన్షన్: షార్ట్, లాంగ్ ప్యాసెజ్ లతోపాటు ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశన్స్.
మ్యాథమెటికల్ స్కిల్స్
అంకగణితం: శాతాలు, లాభనష్టాలు, సరాసరి.
బీజగణితం: సమీకరణాలు, అసమానతలు
జామెట్రీ: వృత్తాలు, త్రిభుజాలు, నిరూపక జ్యామితి
డేటా వివరణ: చార్టులు, గ్రాఫ్‌లు, పట్టికలు
డేటా అనాలసిస్ అండ్ సఫిషియెన్సీ
అనలైటికల్ రీజనింగ్: డేటా కాంప్రహెన్షన్ అండ్ సఫిషియెన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ అన్ గ్రాఫికల్ డేటా, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, లాజికల్ పజిల్స్, కేస్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్– అసంప్షన్ రీజనింగ్
ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్
కరెంట్ అఫైర్స్: జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు.
బిజినెస్ ట్రెండ్స్: విలీనాలు, సముపార్జనలు, కొత్త విధానాలు, సామాజిక సమస్యలు, అంతర్జాతీయ అవగాహన.
ఎగ్జామ్ ప్యాటర్న్
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఐదు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. 120 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ మేనేజ్మెంట్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథమెటికల్ స్కిల్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, డేటా అనాలసిస్ అండ్ సఫిషియెన్సీ 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఎకనామిక్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. మొత్తం ఐదు సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ర్యాంకును ప్రకటిస్తారు.
పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ)
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 15
అడ్మిట్ కార్డ్స్: సెప్టెంబర్ 18.
పీబీటీ డేట్: సెప్టెంబర్ 21
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్: సెప్టెంబర్ 22.
అడ్మిట్ కార్డ్స్: సెప్టెంబర్ 22.
సీబీటీ డేట్: సెప్టెంబర్ 28.
రిజల్ట్స్: సెప్టెంబర్ సీజన్‌కు సంబంధించి స్కోర్ కార్డులను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేస్తారు.
పూర్తి వివరాలకు mat.aima.in
వెబ్సైట్లో సంప్రదించగలరు.