పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఎయిమ్స్ జోధ్‌‌పూర్‌‌లో..

జోధ్‌‌పూర్‌‌లోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌‌ల్ సైన్సెస్
(ఎయిమ్స్‌‌).. 112 సీనియర్​ రెసిడెంట్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: అనస్తీషియాలజీ, అనాట‌‌మీ, బ‌‌యో కెమిస్ట్రీ, కార్డియాల‌‌జీ, డెంటిస్ట్రీ, జ‌‌న‌‌‌‌ర‌‌ల్ మెడిసిన్‌‌, జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌ర్జరీ, న్యూరాల‌‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్, పేడియాట్రిక్స్​, సైకాలజీ, సైకియాట్రీ త‌‌దిత‌‌రాలు; అర్హత‌‌: సంబంధిత స‌‌బ్జెక్టుల్లో ఎండీ/ ఎంఎస్​/ డీఎన్‌‌బీ/ ఎంసీహెచ్‌‌, పీహెచ్​డీ ఉత్తీర్ణత‌‌; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.800; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 30; వివరాలకు: www.aiimsjodhpur.edu.in

నీలిట్​లో 328 ఖాళీలు

కేంద్ర ఎల‌‌క్ట్రానిక్స్, ​ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ మంత్రిత్వ శాఖ‌‌కు చెందిన ఢిల్లీలోని నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ(నీలిట్​).. కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 328 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ఐటీ ట్రైనింగ్ అండ్ స‌‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్‌‌, ప్రోగ్రామ‌‌ర్ అసిస్టెంట్, ఐటీ మేనేజ‌‌ర్, సీనియ‌‌ర్ ప్రోగ్రామ‌‌ర్‌‌, సిస్టమ్ అన‌‌లిస్ట్‌‌, అసిస్టెంట్ ప్రోగ్రామ‌‌ర్‌‌, ప్రోగ్రామర్​, ప్రాజెక్ట్​/టీమ్​ లీడ్​, నెట్​వర్క్​ స్పెషలిస్ట్​ త‌‌దిత‌‌రాలు

అర్హత‌‌: స‌‌ంబంధిత విభాగాల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్‌‌, ఎంఈ/ఎంటెక్​, ఎంసీఏ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం

విభాగాలు: కంప్యూటర్​ సైన్స్​, ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యూనికేషన్​, ఎలక్ట్రికల్​, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్​ తదితరాలు

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష/ ఇంట‌‌ర్వ్యూ ద్వారా

ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు రూ.300

చివరితేది: 2019 డిసెంబర్​ 16

వెబ్​సైట్​: www.nielit.gov.in

ఐహెచ్ఎమ్‌‌-బెంగ‌‌ళూరులో..

బెంగ‌‌ళూరులోని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌‌ల్ మేనేజ్‌‌మెంట్‌‌(ఐహెచ్ఎమ్‌‌).. 7 అసిస్టెంట్ లెక్చరర్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఏదైనా డిగ్రీ, స‌‌ంబంధిత‌‌ స‌‌బ్జెక్టుల్లో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత‌‌; విభాగాలు: హోటల్​ అడ్మినిస్ట్రేషన్​, హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్​, హోటల్​ మేనేజ్​మెంట్​/కలినరీ ఆర్ట్స్​/కలినరీ సైన్స్​ తదితరాలు; సెలెక్షన్​ ప్రాసెస్​: స్కిల్‌‌టెస్ట్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 21; వివరాలకు:  www.ihmbangalore.kar.nic.in

సాయ్‌‌లో 130 పోస్టులు

భార‌‌త ప్రభుత్వ యువ‌‌జ‌‌న వ్యవ‌‌హారాలు, క్రీడ‌‌ల మంత్రిత్వ శాఖకు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌‌).. కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 130 యంగ్​ ప్రొఫెషనల్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: స‌‌ంబంధిత‌‌ స‌‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; వయసు: 2019 డిసెంబర్​ 20 నాటికి 32 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 20; వివరాలకు: www.sportsauthorityofindia.nic.in

ఎన్ఐటీ-హ‌‌మీర్‌‌పూర్‌‌లో..

హ‌‌మీర్‌‌పూర్​లోని నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌‌జీ(ఎన్ఐటీ).. 76 టీచింగ్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: సివిల్, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌, మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రానిక్స్ అండ్ క‌‌మ్యూనికేష‌‌న్, కంప్యూట‌‌ర్ సైన్స్‌‌, కెమిక‌‌ల్, ఆర్కిటెక్చర్​, కెమిస్ట్రీ, మేనేజ్​మెంట్ స్టడీస్​ త‌‌దిత‌‌రాలు; అర్హత‌‌: స‌‌ంబంధిత‌‌ స‌‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్​, ఎంఈ/ఎంటెక్​, పీహెచ్‌‌డీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ప్రజెంటేష‌‌న్‌‌/ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివ‌‌రితేది: 2020 జనవరి 20; వివరాలకు: www.nith.ac.in

కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్‌‌లో..

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌‌యార్డ్ లిమిటెడ్.. 29 షిప్ డ్రాఫ్ట్స్‌‌మెన్ ట్రైనీ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: పదో తరగతి, స‌‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; విభాగాలు: మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌; వ‌‌య‌‌సు: 2019 డిసెంబర్​ 20 నాటికి 25 ఏళ్లు మించ‌‌కూడ‌‌దు; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆబ్జెక్టివ్ టైప్ ఆన్‌‌లైన్ టెస్ట్‌‌, ప్రాక్టిక‌‌ల్ టెస్ట్ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.200, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 20; వివరాలకు: www.cochinshipyard.com

సెంట్రల్ యూనివ‌‌ర్సిటీలో..

త‌‌మిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాల‌‌యం.. 29 టీచింగ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: అప్లైడ్ సైకాల‌‌జీ, కంప్యూట‌‌ర్ సైన్స్‌‌, ఎక‌‌నమిక్స్‌‌, ఎడ్యుకేష‌‌న్, ఇంగ్లిష్, హిస్టరీ, మెటీరియల్​ సైన్స్, మీడియా అండ్​ మాస్​ కమ్యూనికేషన్, మ్యూజిక్​, సోషల్​ వర్క్, లా తదితరాలు; అర్హత‌‌: స‌‌ంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్​ డిగ్రీ, పీహెచ్‌‌డీ, నెట్​ ఉత్తీర్ణత‌‌తో పాటు టీచింగ్ అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.500; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 26; వివరాలకు: www.cutn.ac.in

బీహెచ్ఈఎల్‌‌లో..

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న భార‌‌త్ హెవీ ఎలక్ట్రికల్స్​ లిమిటెడ్‌‌ (బీహెచ్ఈఎల్‌‌)..  6 పార్ట్​టైం మెడికల్​ ప్రొఫెషనల్స్​​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: సంబంధిత విభాగంలో ఎంబీబీఏస్‌‌, ఎంస్/ డీఎన్‌‌బీ, డీఎం/డీఎన్​బీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; విభాగాలు: జ‌‌న‌‌ర‌‌ల్ స‌‌ర్జరీ, యూరాలజీ, గ్రాస్ట్రాల‌‌జీ, ఎంబీబీఎస్​; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్​లిస్టింగ్​, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 27; వివరాలకు: www.web.bhelhyd.co.in

సీయూఎస్‌‌బీలో టీచింగ్​ స్టాఫ్​

గ‌‌యాలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ సౌత్ బిహార్‌‌(సీయూఎస్‌‌బీ).. 60 టీచింగ్‌‌ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవచ్చు. అర్హత‌‌: సంబంధిత స‌‌బ్జెక్టుల్లో బీఫార్మసీ/ఎంఫార్మసీ, మాస్టర్స్​ డిగ్రీ, ఎంఫిల్​/పీహెచ్‌‌డీ, నెట్/స్లెట్‌‌/సెట్‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.2000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.1000; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 18; హార్డ్‌‌కాపీల‌‌ను పంపడానికి: 2019 డిసెంబర్​ 23; వివరాలకు: www.cusb.ac.in

ట్రిపుల్​ఐటీడీఎంలో నాన్ టీచింగ్ స్టాఫ్​

క‌‌ర్నూల్‌‌లోని ఇండియ‌‌న్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ డిజైన్ అండ్ మాన్యూఫాక్చరింగ్‌‌(ట్రిపుల్​ఐటీడీఎం).. 19 గ్రూప్​ ‘ఏ’ ‘బీ’ ‘సీ’ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు: అసిస్టెంట్ రిజిస్ట్రార్‌‌, టెక్నిక‌‌ల్ ఆఫీస‌‌ర్‌‌, జూనియ‌‌ర్ ఇంజినీర్‌‌, జూనియ‌‌ర్ టెక్నిక‌‌ల్ సూప‌‌రింటెండెంట్‌‌, జూనియ‌‌ర్ అసిస్టెంట్‌‌; అర్హత‌‌: స‌‌ంబంధిత విభాగాల్లో డిప్లొమా, బ్యాచిల‌‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంఎస్సీ/ఎంసీఏ​ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత‌‌ప‌‌రీక్ష/ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివరితేది: 2019 డిసెంబర్​ 24; హార్డ్‌‌కాపీల‌‌ను పంప‌‌డానికి: 2020 జనవరి 3; వివరాలకు: www.iiitk.ac.in

ఎల్ఐసీ-హెచ్ఎఫ్ఎల్‌‌లో..

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌‌న్‌‌(ఎల్ఐసీ)కి చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌‌(హెచ్ఎఫ్ఎల్).. దేశ‌‌వ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో 35 అసిస్టెంట్ మేనేజర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూట‌‌ర్ స్కిల్స్‌‌ ఉండాలి. వయసు: 2019 జనవరి 1 నాటికి 23–30 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్ టెస్ట్‌‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా; ఫీజు: రూ.500; చివరితేది: 2019 డిసెంబర్​ 16; పరీక్షతేది: 2020 జనవరి 27; వివరాలకు: www.lichousing.com

ఎన్‌‌సిఆర్‌‌టిసీలో 40 పోస్టులు

ఢిల్లీలోని నేష‌‌న‌‌ల్ క్యాపిట‌‌ల్ రీజియ‌‌న్ ట్రాన్స్‌‌పోర్ట్ కార్పొరేష‌‌న్ (ఎన్‌‌సిఆర్‌‌టిసీ).. 40 జూనియర్​ ఇంజినీర్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: సివిల్​ విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణతతో పాటు పని అనుభ‌‌వం; వయసు: 2019 డిసెంబర్​ 7 నాటికి 30 ఏళ్లు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, రాత‌‌ప‌‌రీక్ష, ఇంట‌‌ర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 21; వివరాలకు: www.ncrtc.in

ఎన్‌‌హెచ్ఎస్ఆర్‌‌సీఎల్‌‌లో మేనేజ‌‌ర్స్​

నేష‌‌న‌‌ల్ హై స్పీడ్ రైల్ కార్పొరేష‌‌న్ లిమిటెడ్ (ఎన్‌‌హెచ్ఎస్ఆర్‌‌సిఎల్‌‌).. 15  పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: మేనేజ‌‌ర్ (డిజైన్‌‌), సీనియ‌‌ర్ మేనేజ‌‌ర్, ఏజీఎం, సీనియ‌‌ర్ మేనేజ‌‌ర్‌‌(క్వాలిటీ కంట్రోల్‌‌), ఏజీఎం(క్వాలిటీ కంట్రోల్‌‌), జ‌‌న‌‌ర‌‌ల్ మేనేజ‌‌ర్, సీనియ‌‌ర్ అడ్వైజ‌‌ర్‌‌; అర్హత‌‌: సివిల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా/ బీటెక్​ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్​లిస్టింగ్​, ఇంటర్వ్యూ ద్వారా; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 24; వివరాలకు: www.nhsrcl.in

బీఈసీఐఎల్లో 98 ఖాళీలు

నోయిడాలోని బ్రాడ్‌‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌‌(బీఈసీఐఎల్‌‌).. కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 98 వివిధ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: ప‌‌బ్లిక్ హెల్త్​ న‌‌ర్సు, క్యాట‌‌రింగ్ సూప‌‌ర్‌‌వైజ‌‌ర్‌‌, ఆక్సిల‌‌రీ న‌‌ర్సింగ్ మిడ్‌‌వైఫ్‌‌(ఏఎన్ఎం), డ్రెస్సర్‌‌, డైటీషియ‌‌న్‌‌, కుక్‌‌, రిసెప్షనిస్ట్​; అర్హత‌‌: ప‌‌దోత‌‌ర‌‌గ‌‌తి, సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌తో పాటు ప‌‌ని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: టెస్ట్‌‌/ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 25; వివరాలకు: www.becil.com