పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఎయిర్ ఫోర్స్​లో ఎయిర్‌‌మెన్ పోస్టులు

ఇండియ‌‌న్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్‌‌) గ్రూప్ ఎక్స్​, గ్రూప్ వై ట్రేడుల్లో ఎయిర్‌‌మెన్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అవివాహితులైన పురుషులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
గ్రూప్ ఎక్స్​ (ఎడ్యుకేష‌‌న్ ఇన్‌‌స్ట్రక్టర్​ ట్రేడ్ మిన‌‌హాయించి)
అర్హత‌‌: మ్యాథ్స్‌‌, ఫిజిక్స్‌‌, ఇంగ్లిష్ స‌‌బ్జెక్టుల‌‌తో ఇంటర్మీడియట్/ఏదైనా సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత‌‌
గ్రూప్ వై (ఆటోమొబైల్ టెక్నీషియ‌‌న్‌‌, జీటీఐ, ఐఏఎఫ్‌‌(పి), ఐఏఎఫ్‌‌(ఎస్‌‌), మ్యుజీషియ‌‌న్ ట్రేడులు మిన‌‌హాయించి)
అర్హత‌‌: మ్యాథ్స్​, ఫిజిక్స్​, ఇంగ్లిష్​​ సబ్జెక్టుల్లో ఇంటర్​/వొకేషనల్​ ఇంటర్​ ఉత్తీర్ణత‌‌
గ్రూప్ వై మెడిక‌‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌‌
అర్హత‌‌: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బ‌‌యాల‌‌జీ, ఇంగ్లిష్ స‌‌బ్జెక్టుల‌‌తో ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత‌‌
వ‌‌య‌‌సు: 17 జ‌‌న‌‌వ‌‌రి 2000 నుండి 30 డిసెంబ‌‌రు 2003 మ‌‌ధ్య జ‌‌న్మించి ఉండాలి
సెలెక్షన్​ ప్రాసెస్​: మొత్తం రెండు ఫేజ్​లలో సెలెక్షన్​ ఉంటుంది. ఫేజ్​–1 ఆబ్జెక్టివ్​ తరహా ఆన్​లైన్​ టెస్ట్. దీనిలో ప్రతి తప్పు జవాబుకు 0.25 నెగెటివ్​ మార్క్​​ ఉంటుంది. ఫేజ్​–1లో క్వాలిఫై అయిన వారికి ఫేజ్​–2 ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్‌‌, మెడిక‌‌ల్ టెస్ట్ నిర్వహించి ఫైనల్​ సెలెక్షన్ చేస్తారు
ఫీజు: రూ.250
ద‌‌ర‌‌ఖాస్తుల ప్రారంభం: 2020 జనవరి 2
చివ‌‌రితేది: 2020 జనవరి 20

వెబ్​సైట్​: www.indianairforce.nic.in

బ్యాంక్ ఆఫ్ మ‌‌హారాష్ట్రలో ‌‌‌‌‌‌లిస్ట్ ఆఫీస‌‌ర్స్

పుణె ప్రధాన‌‌ కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ మ‌‌హారాష్ట్ర 300 జనరలిస్ట్​ ఆఫీసర్​ స్కేల్​2,3 పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఏదైనా డిగ్రీ, జేఏఐఐబీ, సీఏఐఐబీ ఉత్తీర్ణత‌‌తో పాటు పని అనుభ‌‌వం; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్ టెస్ట్‌‌, ఇంట‌‌ర్వ్యూ/ గ్రూప్​ డిస్కషన్; ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ఎస్టీలకు రూ.100, దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 31; వివరాలకు: www.bankofmaharashtra.in

ఆర్‌‌బీఐలో 926 అసిస్టెంట్స్​

రిజ‌‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ‌‌వ్యాప్తంగా ఉన్న సంస్థకు చెందిన బ్రాంచుల్లో 926 అసిస్టెంట్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఏదైనా బ్యాచిల‌‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌తో పాటు సంబంధిత లోకల్​ లాంగ్వేజ్​లో పరిజ్ఞానం; వ‌‌య‌‌సు: 2019 డిసెంబర్​ 1 నాటికి 20–-28 ఏళ్లకు మించకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమిన‌‌రీ, మెయిన్, లాంగ్వేజ్ ప్రొఫిషియ‌‌న్సీ టెస్ట్(ఎల్​పీటీ); చివ‌‌రితేది: 2020 జనవరి 16; ప్రిలిమిన‌‌రీ ప‌‌రీక్ష: 2020 ఫిబ్రవ‌‌రి 14, 15 తేదీల్లో; మెయిన్ ప‌‌రీక్ష: మార్చి 2020; వివరాలకు: www.rbi.org.in

టీసీఎస్లో ఉద్యోగాలు

2019–20 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థులకు టీసీఎస్​ నిర్వహించే నేషనల్​ ఎలిజిబిలిటీ టెస్ట్​కు ప్రకటన విడుదలైంది. ఎంపికైన వారిని శాశ్వత ప్రాతిపదికన టీసీఎస్​లో విధుల్లోకి తీసుకుంటారు. ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. విభాగాలు: బ్యాంకింగ్​ అండ్​ ఇన్సూరెన్స్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​, ట్రావెల్ టూరిజం అండ్​ హాస్పిటాలిటీ, టెలికాం, తదితరాలు; అర్హత: బీఏ, బీకాం, బీఎస్సీ ఫైనల్​ ఇయర్​ చదువుతుండాలి, రెండేళ్ల కంటే ఎక్కువ అకడమిక్​ గ్యాప్, పెండింగ్​ బ్యాక్​లాగ్స్​​ ఉండకూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: ఎలిజిబిలిటీ టెస్ట్​, ఇంటర్వ్యూ ద్వారా; చివరితేది: 2020 జనవరి 5; వివరాలకు: www.tcs.com/careers

నీరీలో ప్రాజెక్ట్​ స్టాఫ్

నాగ్‌‌పుర్‌‌లోని కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​(సీఎస్ఐఆర్‌‌)కి చెందిన నేష‌‌న‌‌ల్ ఎన్విరాన్‌‌మెంట‌‌ల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్(నీరీ)కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న‌‌ 58 ప్రాజెక్ట్​ అసిస్టెంట్ లెవెల్​ 1,2,3​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈమెయిల్​/ఆఫ్​లైన్​ ద్వారా ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: స‌‌ంబంధిత స‌‌బ్జెక్టుల్లో బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత‌‌; సెలెక్షన్ ప్రాసెస్​: షార్ట్‌‌లిస్టింగ్‌‌, ప‌‌ర్సన‌‌ల్ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఈ–మెయిల్‌‌: wtmd@neeri.res.in; చివ‌‌రితేది: 2019 డిసెంబర్ 31; వివరాలకు: www.neeri.res.in

వీఎస్ఎస్‌‌సీలో..

తిరువ‌‌నంత‌‌పురంలోని ఇస్రోకి చెందిన విక్రం సారాభాయి స్పేస్ సెంట‌‌ర్‌‌(వీఎస్ఎస్‌‌సీ) 63 టెక్నికల్​ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విభాగాలు: మెకానిక‌‌ల్‌‌, ఎల‌‌క్ట్రానిక్స్, కెమికల్​, కంప్యూటర్​ సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​, ఆటోమొబైల్, ఎల‌‌క్ట్రిక‌‌ల్‌‌, సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ; అర్హత‌‌: ఏదైనా డిగ్రీ, స‌‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, పీజీ ఉత్తీర్ణత; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత ప‌‌రీక్ష, స్కిల్‌‌టెస్ట్‌‌ ద్వారా; ఫీజు: జ‌‌న‌‌ర‌‌ల్ కేట‌‌గిరీ రూ.250, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-స‌‌ర్వీస్‌‌మెన్‌‌/మ‌‌హిళ‌‌లు/విక‌‌లాంగుల‌‌కు ఫీజు మిన‌‌హాయింపు; చివ‌‌రితేది: 2020 జనవరి 1; వివరాలకు: www.vssc.
gov.in

ఏపీఎస్‌‌- గోల్కొండలో..

గోల్కొండ‌‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌‌(ఏపీఎస్‌‌) 32 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈమెయిల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌‌టీ, పీఈటీ; అర్హత‌‌: స‌‌ంబంధిత స‌‌బ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిల‌‌ర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, పని అనుభ‌‌వం; ఈ–మెయిల్‌‌: apsgolconda@gmail.com; చివ‌‌రితేది: 2020 జనవరి 5; వివరాలకు: www.apsgolconda.edu.in

సికింద్రాబాద్‌‌ ఆర్మీ ‌‌బ్లిక్ స్కూల్‌‌లో..

సికింద్రాబాద్‌‌ పరిధిలోని ఆర్‌‌కే పురం ఆర్మీ ప‌‌బ్లిక్ స్కూల్ 40 టీచింగ్ పోస్టుల భ‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌‌ర్‌‌(పీజీటీ)–06, ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్ టీచ‌‌ర్‌‌(టీజీటీ)–13, ప్రైమ‌‌రీ టీచ‌‌ర్(పీఆర్​టీ)–27; అర్హత‌‌: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, పీజీ ఉత్తీర్ణత‌‌; వ‌‌య‌‌సు: 2020 ఏప్రిల్​ 1 నాటికి 40 ఏళ్లు మించ‌‌కూడదు; సెలెక్షన్​ ప్రాసెస్​: స్ర్కీనింగ్ టెస్ట్‌‌, సీఎస్‌‌బీ ఇంట‌‌ర్వ్యూ ద్వారా; ఫీజు: రూ.100; చివ‌‌రితేది: 2020 జనవరి 5; వివరాలకు: www.apsrkpuram.edu.in

రాంమ‌‌నోహ‌‌ర్ లోహియా​లో

న్యూఢిల్లీలోని డాక్టర్ రాంమ‌‌నోహ‌‌ర్ లోహియా హాస్పిట‌‌ల్ 146 జూనియర్​ రెసిడెంట్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో ద‌‌ర‌‌ఖాస్తు చేసుకోవాలి. అర్హత‌‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌‌; వయసు: 2019 డిసెంబర్​ 31 నాటికి 30 ఏళ్లు; సెలెక్షన్​ ప్రాసెస్​: రాత ప‌‌రీక్ష; ఫీజు: రూ.800, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు; చివ‌‌రితేది: 2019 డిసెంబర్​ 31; వివరాలకు: www.rmlh.nic.in