పండగ సీజన్​ సేల్స్​ జోరు... టైర్​2 సిటీల్లో జాబ్స్ హోరు

పండగ సీజన్​ సేల్స్​ జోరు... టైర్​2 సిటీల్లో జాబ్స్ హోరు

ముంబై: టైర్ 2, టైర్​ 3 సిటీలలో పెరుగుతున్న కన్జంప్షన్​ ఆ సిటీలలో కొత్త జాబ్స్​ రావడానికి సాయపడుతోంది. ముఖ్యంగా రాబోయే పండగ సీజన్​లో కొనుగోళ్లు పెరుగుతాయనే అంచనాలుండటంతో భారీ సంఖ్యలో  టెంపరరీ జాబ్స్​ వస్తాయని స్టాఫింగ్ కంపెనీలు చెబుతున్నాయి. జైపూర్​, అహ్మదాబాద్, కోయంబతూర్​, లక్నో, వదోదర, సూరత్​, భుబనేశ్వర్, భోపాల్​, లూథియానా, చండీగఢ్​​, వైజాగ్​ వంటివి ఈ జాబితాలో ఉన్నట్లు మాన్​పవర్​, రాన్​స్టాడ్​, క్వెస్, టీమ్​లీజ్​, యాడెకో, పెర్సొల్​కెల్లీ వంటి స్టాఫింగ్​ కంపెనీలు పేర్కొంటున్నాయి. కిందటేడాది పండగ సీజన్​తో పోలిస్తే  టైర్​2, టైర్​3 సిటీలలో ఈసారి  టెంపరరీ వర్కర్లకు  డిమాండ్  ​రెట్టింపైనట్లు మాన్​  పవర్ ​కంపెనీ సీనియర్​ డైరెక్టర్​ అలోక్​ కుమార్​ చెప్పారు. 

ఈ–కామర్స్​, బీఎఫ్​ఎస్​ఐ, రిటెయిల్​, కన్జూమర్​ ప్రొడక్ట్స్​, మాన్యుఫాక్చరింగ్​, ఐటీ, ఫార్మా అండ్​ హెల్త్​కేర్, పేమెంట్​ గేట్​వే, లాజిస్టిక్స్​, వేర్​హౌసింగ్, ఫుడ్, టెలికం ఇండస్ట్రీలు కొత్త జాబ్స్​ ఇస్తున్నాయని అన్నారు. ఆగస్టు చివరి నుంచి డిసెంబర్​ మధ్య కాలంలో చిన్న  సిటీలలో ఏకంగా 6 నుంచి 7 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు.

టైర్​2, టైర్​3 సిటీలలో టెంపరరీ స్టాఫ్​కు డిమాండ్​ ఈ ఏడాది 20–25 శాతం పెరుగుతందని అంచనా వేస్తున్నట్లు  ర్యాండ్​స్టాడ్ ​ టెక్నాలజీస్ ​ చీఫ్​ కమర్షియల్​ ఆఫీసర్​ యెషాబ్ గిరి వెల్లడించారు. వేర్​హౌస్, లాస్ట్– మైల్​ డెలివరీ, కాల్​ సెంటర్ల ఉద్యోగులకు డిమాండ్​  ఎక్కువగా ఉందని  పేర్కొన్నారు. రూరల్​ ఏరియాలలో కన్జంప్షన్​ పెరుగుదల వల్లే ఈ ట్రెండ్​ వచ్చిందని వివరించారు. ఫ్యాషన్​, ప్యాకేజ్డ్​ గూడ్స్​, కాస్మెటిక్స్, లైఫ్​స్టైల్ యాక్సెసరీస్​  వంటి వాటికి రూరల్​ ఏరియాలలో గట్టి డిమాండ్​ ఉండటంతో  రిటెయిలర్లు ఆ మార్కెట్లపై ఫోకస్​ పెడుతున్నారని  యెషాబ్​ గిరి చెప్పారు. తమ ఉద్యోగులలో 63 శాతం మంది చిన్న పట్టణాలలోనే ఉన్నట్లు క్వెస్​ కార్ప్​ చెబుతోంది.