మ్యాట్రిమోనీ డాట్​ కామ్ ‘జోడీ’ యాప్

మ్యాట్రిమోనీ డాట్​ కామ్ ‘జోడీ’ యాప్

హైదరాబాద్, వెలుగు:  డిగ్రీ కంటే తక్కువ చదువుకున్న వాళ్లు పెళ్లి సంబంధాల కోసం తేలికగా ఉపయోగించడానికి మ్యాట్రిమోనీ డాట్​ కామ్ ‘జోడీ’ యాప్​ను లాంచ్​ చేసింది. తెలుగు సహా హిందీ, మరాఠీ, బెంగాలి, పంజాబీ, గుజరాతీ, తమిళం వంటి తొమ్మిది భాషల్లో దీనిని వాడుకోవచ్చు. చాలా మంది తమ సొంత భాషలో ఉండే పెళ్ళి సంబంధాల ప్లాట్​ఫారమ్​ కోసం చూస్తున్నారని, అందుకే ఈ  ఆండ్రాయిడ్ యాప్​ను లాంచ్​ చేసినట్టు తెలిపింది. డిప్లమా, పాలిటెక్నిక్, 12వ తరగతి, 10వ తరగతి లేదా అంతకన్నా తక్కువ చదివిన వారి అవసరాలను జోడీ యాప్ తీరుస్తుంది.   కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వారి కోసం దీనిని డెవెలప్​ చేశారు.  ‘‘దేశమంతటా నెట్​, స్మార్ట్​ఫోన్​ వాడకం పెరగడం వల్ల డిజిటల్​ సర్వీసులను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో పెళ్ళి సంబంధాలు కుదుర్చుకోవడం పెరుగుతున్నా, మిగిలిన డిజిటల్ సర్వీసుల్లో కనిపిస్తున్న స్థాయిలో అది లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న మ్యాట్రిమోనియల్​ సైట్లు ఇంగ్లీష్​లోనే ఎక్కువగా ఉన్నాయి. తక్కువ చదువుకున్న వాళ్లు వీటిని వాడకం కొంచెం కష్టం. బంధుమిత్రులు చూసే సంబంధాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. డిజిటల్ ప్లాట్​ఫారమ్​ ద్వారా అయితే చాలా సంబంధాలు ఉంటాయి”అని మ్యాట్రిమోనీ డాట్​ కామ్​ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అర్జున్​ భాటియా వివరించారు.  యూజర్లు తమ సొంత భాషలో రిజిస్టర్ చేసుకోవచ్చు, మతం, నగరం, కులం, విద్య, ఆదాయం ఆధారంగా తమ సంబంధాన్ని ఎంచుకోవచ్చు.  పురుష సభ్యులందరూ తమ ప్రొఫైల్‌‌‌‌ను ఒక ప్రభుత్వ గుర్తింపుకార్డుతో వెరిఫై చేయించుకోవాలి. మూడు నెలల ప్యాకేజీకి రూ.990, ఆరు నెలలకు అయితే రూ.1,500 చెల్లించాలి.