బిడెన్ అధికారంలోకి వస్తే ప్రజలకు పీడకలే

బిడెన్ అధికారంలోకి వస్తే ప్రజలకు పీడకలే

ఓల్డ్ ఫోర్జ్: అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచార హోరు ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జో బిడెన్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. తాజాగా బిడెన్‌పై ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ఓటర్లతో బిడెన్‌ను ఉద్దేశించి.. ఆయన మీకో చెత్త పీడకల లాంటి వారని ట్రంప్ ఎద్దేవా చేశారు. అమెరికా వర్కర్లను బిడెన్ కొనుగోలు చేశారని, ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే మాత్రం ప్రజలకు పీడకలేనన్నారు.

ఓల్డ్ ఫోర్జ్‌లో ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘గత అర్ధ శతాబ్దం నుంచి ఆయన వాషింగ్టన్‌లోనే ఉంటూ మన దేశ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. మన జాబ్స్‌ను ఇతర కంట్రీస్‌ దోచుకునేలా చేస్తున్నారు’ అని విమర్శించారు. వైట్‌ హౌజ్‌ కోసం డెమొక్రాట్ పార్టీ తరఫున నామినేషన్‌ను అంగీకరించి.. దేశ ప్రజలను ఉద్దేశించి బిడెన్ మాట్లాడటానికి కొన్ని గంటల ముందే ట్రంప్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం.