ప్రముఖ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను లేటెస్ట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, తన కాబోయే భార్యను అధికారికంగా పరిచయం చేశాడు.
ఈ సందర్భంగా షణ్ముఖ్.. “ఫిబ్రవరి 25న అంటే ఈరోజే నా నిశ్చితార్థం జరిగింది. దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు” అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వైరల్ ఫొటోల్లో షణ్ముఖ్, వైష్ణవి ఇద్దరూ గోల్డెన్ కలర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రేమతో ఒకరినొకరు చూసుకుంటూ, వైష్ణవికి షణ్ముఖ్ రింగ్ తొడిగిన ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, వైష్ణవితో షణ్ముఖ్ క్రేజీ స్టెప్పులు వేస్తూ అలరించే వీడియో సైతం వీపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ జంటను చూసిన నెటిజన్లు “క్యూట్ కపుల్” అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షణ్ముఖ్ కాబోయే భార్య వైష్ణవి చోడిశెట్టి కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం.
కెరీర్ విషయానికి వస్తే, షణ్ముఖ్ ప్రస్తుతం ఓటీటీ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన లీలా వినోదం యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అతను హీరోగా ప్రేమకు నమస్కారం అనే సినిమాను ప్రారంభించాడు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, లేటెస్ట్గా విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇకపోతే, గతంలో షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునైనా ప్రేమించుకుని, బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.
