ఎలన్ మస్క్ నిర్ణయం పెద్ద మార్పును తీసుకొస్తుంది

ఎలన్ మస్క్ నిర్ణయం పెద్ద మార్పును తీసుకొస్తుంది

అమెరికా.. వాణజ్యం, టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొన్న భారత్ తో బోయింగ్ విమానాల కొనుగోలు డీల్ కుదిరింది. ఇప్పుడు తాజాగా టెస్లా యొక్క సూపర్‌ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ ని విస్తరిస్తున్నారు. భవిష్యతంతా ఈవీలదే కాబట్టి ఇప్పటినుండే ఆ దిశగా తొలి అడుగులు వేస్తున్నారు.

ఎలన్ మస్క్ 2024 కల్లా టెస్లా ద్వారా 7,500 సూపర్‌ ఛార్జింగ్, డెస్టినేషన్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించనున్నాడు. దీనికోసం 7.5 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని మస్క్ తెలిపాడు. మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రశంసించారు. ఈ నిర్ణయం భవిష్యత్తులు పెద్ద మార్పును తీసుకొస్తుందని అన్నారు.