రేపు పబ్లిక్‌‌గా వ్యాక్సిన్ తీసుకుంట: జో బైడెన్

రేపు పబ్లిక్‌‌గా వ్యాక్సిన్ తీసుకుంట: జో బైడెన్

అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్

వాషింగ్టన్: అమెరికాలో రెండో వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చిందని, కరోనాపై పోరులో ఇది మరో మైల్ స్టోన్ లాంటిదని  ప్రెసిడెంట్ ఎలక్ట్‌‌ జో బైడెన్ అన్నారు. సోమవారం తాను పబ్లిక్ గా వ్యాక్సిన్ తీసుకుంటానని, సైంటిఫిక్ ప్రాసెస్ పట్ల అమెరికన్లకు నమ్మకం పెంచుతానని ఆయన వెల్లడించారు. తక్కువ టైంలో పవర్ ఫుల్ వ్యాక్సిన్ లను డెవలప్ చేసిన సైంటిస్టులు, మెడికల్ ఎక్స్ పర్టులు, వాలంటీర్లకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు కోట్లాది మందికి వెంటనే వ్యాక్సిన్ వేయాల్సిన టాస్క్ ఉందని, ఆ వెంటనే కరోనా, ఎకానమిక్ రిలీఫ్​ప్యాకేజ్ ను పాస్ చేయాల్సిన అవసరం ఉందని బైడెన్ తెలిపారు. మోడెర్నా కంపెనీ తయారు చేసిన ‘ఎంఆర్ఎన్ఏ–1273’ వ్యాక్సిన్ ను ఎమర్జెన్సీ యూజ్ కింద వాడొచ్చని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​డీఏ) శుక్రవారం ఆమోదం తెలిపింది.

చైనా వ్యాక్సిన్‌లతో రిస్క్: మైక్ పాంపియో  

కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) దర్యాప్తుకు చైనా ఇంకా ఆటంకం కల్పిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహమ్మారి మొదలై ఏడాదవుతున్నా చైనా ఇంకా తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. ఏడాది తర్వాత ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ లను చైనా పలు దేశాలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఆ వ్యాక్సిన్ ల సేఫ్టీ, ఎఫికసీపై ఎలాంటి సమాచారం వెల్లడించకుండానే వాటిని అమ్మజూస్తోందని, వాటితో చైనాకు, ప్రపంచ ప్రజలకూ ముప్పు ఉందన్నారు. కరోనా అనుకోకుండా పుట్టిన వైరస్ మాత్రం కాదన్నారు.

200 కోట్ల డోసులకు ‘కొవ్యాక్స్’ అగ్రిమెంట్లు

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ లు అందేందుకు గాను 64 సంపన్న దేశాలతో కలిసి ఏర్పడిన ‘కొవ్యాక్సిన్’ కూటమి కీలక ముందడుగు వేసింది. వివిధ దేశాల్లోని కంపెనీలన్నింటితో కలిసి 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పొందేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నట్లు కొవ్యాక్స్ ప్రకటించింది.  వీటిలో 20 కోట్ల డోసులు ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెకా నుంచి అందనున్నాయని తెలిపింది. ఇందుకోసం ఇండియాలోని సీరమ్ ఇనిస్టిట్యూట్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పింది.

For More News..

దేశంలో కరోనా సెకండ్​వేవ్​ రాదు

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో తగ్గిన ఇంటి కిరాయిలు

16 ఏండ్ల బాలికతో క్షుద్రపూజలు?