
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా ముగిశాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం బావిష్యవాణిలో కోరిన కోరిక మేరకు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో సాకను పెట్టగా.. మంగళవారం ఆషాఢమాసం తుది బోనంను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సమర్పించారు.
కార్పొరేటర్ కార్యాలయం నుండి
బోనం ఎత్తుకొని జోగిని శ్యామల నృత్యం చేస్తూ దేవాలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించింది.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రంగంలో స్వర్ణలత బావిష్యవాణిలో జాతర పట్ల సంతృప్తి చెందినట్లు తెలిపిందన్నారు. అయితే మారుబోనం కోరిందని.. అమ్మవారి కోరిక మేరకు ప్రభుత్వం తరపున బోనం సమర్పించామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందరూ ఆర్థికంగా బలపడి బంగారు తెలంగాణకు దారి తీయాలని తెలిపారు ఇంద్రకరణ్ రెడ్డి.