షారూఖ్ ఇండియాలోనే నంబర్1 యాక్షన్ హీరో: జాన్ అబ్రహం

షారూఖ్ ఇండియాలోనే నంబర్1 యాక్షన్ హీరో: జాన్ అబ్రహం

షారూఖ్ ఖాన్ దేశంలోనే నంబర్ వన్ యాక్షన్ హీరో అని బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అన్నారు. పఠాన్ సక్సెస్ మీట్ సందర్భంగా జాన్ అబ్రహం మీడియాతో మాట్లాడారు. షారూఖ్ తో కలిసి తాను మొదటి సారి నటించానని అన్నాడు. షారూఖ్ ఒక నటుడు కాదని..అతనొక ఎమోషన్ అని చెప్పాడు. షారూఖ్ ఇంతకు ముందు యాక్షన్ హీరోనే కానీ ఇవాళ దేశంలోనే నంబర్ వన్ యాక్షన్ హీరో అని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తన కెరీర్ లో బిగ్గెస్ట్  హిట్ అవుతుందని అన్నాడు. పఠాన్ సినిమాను ఆదరించినందుకు షారూఖ్ ప్రేక్షకులకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పాడు.  పఠాన్ లో జాన్ అబ్రహం విలన్ గా నటించిన సంగతి తెలిసిందే..

జనవరి 25న రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే  500 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 542 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇండియాలో 335 కోట్ల గ్రాస్, ఓవర్ సిస్ లో రూ.307కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.