జానీ డెప్ కు డిస్నీ 2,355 కోట్ల ఆఫర్!

జానీ డెప్ కు డిస్నీ 2,355 కోట్ల  ఆఫర్!

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న నటుడు జానీ డెప్. కెప్టెన్ జాక్ స్పారోగా ఎంతోమందిని అలరించాడు. అయితే కేరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే భార్య అంబర్ హరాల్డ్ తో గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ వివాదంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కారు. అయితే ఈ కేసులో జానీ డెప్ విజయం సాధించాడు. 

ఇక ఈ వివాదం నేపథ్యంలో డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు అతడితో మూవీస్ చేయడానికి నిరాకరించాయి. కానీ కోర్టు అతడి నిర్ధోషిగా ప్రకటించడంతో పరిస్థితి తారుమారైంది. మళ్లీ జానీ డెప్ తో సినిమాలు చేయడానికి పలు నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే దీనికంటే ముందే జానీ డెప్ ను క్షమాపణ కోరుతూ డిస్నీ లెటర్ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ లో నటించాలని కోరుతూ రూ. 2,355 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరి జానీ డెప్ డిస్నీని మన్నించి కరేబియన్ సిరీస్ లో నటిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.