చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తయ్ : భూక్య జాన్సన్ నాయక్

చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తయ్ : భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్/కడెం, వెలుగు : బీఆర్ఎస్  ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం అయన ఖానాపూర్, కడెం మండలాల్లోని సోమార్ పేట్, బీర్ నంది, కొత్త మద్దిపడగ, ధర్మాజీపేట తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని

మూడోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పలు పార్టీలకు చెందిన నేతలు జాన్సన్ నాయక్  సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఖానాపూర్ వైస్ ఎంపీపీ వాల్ సింగ్, కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా, నాయకులు జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఖానాపూర్ పట్టణ రూపురేఖలు మారుస్తా..

తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఖానాపూర్ పట్టణ రూపురేఖలను పూర్తిగా మారుస్తానని జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ పట్టణ శివారులో నూతనంగా నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇండ్ల వద్ద ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి  మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందని, ఇక్కడ ప్రజలకు మెరుగైన వసతులు ఏర్పాటు చేసి

ఓ కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్, ఖలీల్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రాజా గంగన్న, పరిమి సురేశ్, నాయకులు రాము నాయక్, ప్రదీప్, ఇర్ఫాన్, కిషోర్, మేహరాజ్, సాబీర్ పాషా తదితరులున్నారు.