Jos Buttler: కవర్ డ్రైవ్‌లో కోహ్లీనే కింగ్.. ఓవరాల్‌గా అతడే గ్రేటెస్ట్ బ్యాటర్: బట్లర్

Jos Buttler: కవర్ డ్రైవ్‌లో కోహ్లీనే కింగ్.. ఓవరాల్‌గా అతడే గ్రేటెస్ట్ బ్యాటర్: బట్లర్

పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ ఒకడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో ఈ ఇంగ్లీష్ ఓపెనర్ అత్యంత ప్రమాదకర ఆటగాడు. వైట్ బాల్ క్రికెట్ లో ఇప్పటికే తనదిన ముద్ర వేసిన బట్లర్ ఇటీవలే వెస్టిండీస్ పై వన్డే, టీ20 సిరీస్ లో సత్తా చాటాడు. విండీస్ తో సిరీస్ తర్వాత ఒక పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ బట్లర్ తనకిష్టమైన బ్యాటర్ల గురించి చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో తనకు ఎవరెవరు ఎందులో గ్రేట్ అని తన అభిప్రాయాలను వెల్లడించాడు. 

ఈ ఇంటర్వ్యూలో బట్లర్ మాట్లాడుతూ.. ప్రపంచ క్రికెట్ లో కోహ్లీ కవర్ డ్రైవ్ తనకు ఎంతగానో ఇష్టమని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ కవర్ డ్రైవ్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. బెస్ట్ డిఫెన్స్ ఎవరు అని అడిగితే టెస్ట్ క్రికెట్ లో 'ది వాల్' గా పేరు తెచ్చుకున్న టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ అని చెప్పాడు. ద్రవిడ్ టెస్ట్ క్రికెట్ లో దుర్బేధ్యమైన డిఫెన్స్ తో బౌలర్ల సహనాన్ని పరీక్షించేవాడు. టీమిండియా టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ స్వీప్ తన ఫేవరేట్ అని బట్లర్ అన్నాడు. ఆటిట్యూడ్ లో విండీస్ దిగ్గజ బ్యాటర్ వీవీ రిచర్డ్స్ అని.. సిక్సులు కొట్టడంలో గేల్ కు మించిన వారు లేరని తన అభిప్రాయాన్ని తెలిపాడు. 

ఓవరాల్ గా సౌతాఫ్రికా మాజీ కెప్టెన్.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ క్రికెట్ లో అన్ని షాట్స్ ఆడడంలో బెస్ట్ అని బట్లర్ తన మనసులోని మాటలను షేర్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే ఇంగ్లాండ్ ఇంటిదారి పట్టడంతో బట్లర్ వైట్ బాల్  కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇంగ్లాండ్ జట్టులో కొనసాగుతున్నాడు. అతని స్థానంలో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కు కెప్టెన్సీ చేస్తున్నాడు. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ 2022 టీ20 వరల్డ్  గెలుచుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరినా భారత్ చేతిలో ఓడిపోయింది. అంతర్జాతీ కెరీర్ లో మూడు ఫార్మాట్లలో కలిపి బట్లర్ 10 వేలకు పైగా పరుగులు చేశాడు.