
వాంఖడే వేదికగా భారత్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ తన మాటలతో అభిమానులకి షాకిచ్చాడు. టాస్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్న అతను.. 'ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్' గురించి మాట్లాడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుందని చెప్పిన బట్లర్ అంతలోనే తమ జట్టు ఈ మ్యాచ్ లో నలుగురు కంకషన్ సబ్‌స్టిట్యూట్ లతో బరిలోకి దిగుతుందని వెటకారంగా మాట్లాడాడు.
సాకిబ్ మహమూద్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పిన బట్లర్.. ఇంపాక్ట్ సబ్‌లు రెహాన్ అహ్మద్, సాకిబ్ మహమూద్, జామీ స్మిత్, గుస్ అట్కిన్సన్ లను ప్రకటించాడు. అయితే బట్లర్ కోపానికి కారణం లేకపోలేదు. నాలుగో టీ20 లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శివమ్ దూబే స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒక ఆల్ రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్ రావడంపై బట్లర్ తో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే బట్లర్ టాస్ సమయంలో భారత జట్టుపై సెటైర్ వేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.
ALSO READ : Team India: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకం మొదలు: వన్డే సిరీస్ కోసం నాగ్‌పూర్ చేరుకున్న టీమిండియా
ఇదిలా ఉంటే శివమ్ దూబేకి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన అతన్ని.. కెప్టెన్ సూర్య బాగా ఉపయోగించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 3 కీలక వికెట్లు పడగొట్టి.. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. లివింగ్‌స్టోన్(9), జాకబ్ బెథెల్(6), జామీ ఓవర్టన్(19).. ముగ్గరిని పెవిలియన్ చేర్చాడు. ఇక ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగిన చివరి టీ20లోనూ ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 1-4 తేడాతో కోల్పోయింది.
Jos Buttler not holding back.?
— KS (@161atOptus) February 2, 2025
He actually announced 4 impact subs at toss itself.?? pic.twitter.com/TcHQEZsZ9D