IND VS ENG 2025: టంగ్ దెబ్బకు వికెట్ ఎగిరింది: ఇంగ్లాండ్ పేసర్ ఇన్ స్వింగ్ ధాటికి కుదేలైన రాహుల్

IND VS ENG 2025: టంగ్ దెబ్బకు వికెట్ ఎగిరింది: ఇంగ్లాండ్ పేసర్ ఇన్ స్వింగ్ ధాటికి కుదేలైన రాహుల్

ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుతమైన డెలివరీ చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో భాగంగా  ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ బౌలింగ్ లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇన్నింగ్స్ 30 ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి తొలి జోష్ టంగ్ విసిరిన బంతి పిచ్ ఇన్ లైన్ లో పడి అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. వేగంతో దూసుకొచ్చిన ఈ బాల్ రాహుల్ ఆడే లోపే వికెట్లను గిరాటేసింది. ఈ ఇంగ్లీష్ బౌలర్ కనీసం రాహుల్ బంతిని ఆడే సమయం కూడా ఇవ్వలేదు. 

ALSO READ | BAN vs IND: ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్‌ వాయిదా.. వచ్చే ఏడాది ఎప్పుడంటే..?

స్వింగ్ తో పాటు వేగం కూడా ఉండడంతో మిడ్ వికెట్ స్టంప్ గింగరాలు తిరిగి చాలా దూరంలో పడింది. దీంతో అప్పటివరకు ఎంతో ఫోకస్ గా జాగ్రత్తగా ఆడుతున్న రాహుల్ కు టంగ్ విసిరినా బంతికి సమాధానామే లేకుండా పోయింది. రాహుల్ వికెట్ తో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ నిరాశగా పెవిలియన్ కు చేరాడు. రాహుల్ ఔటైనా ఇండియా పటిష్ట స్థితిలోనే నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 460 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి 500 పరుగుల టార్గెట్ సెట్ చేసే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టనైకి 280 పరుగులు చేసింది. క్రీ లో గిల్ (90), జడేజా (11) ఉన్నారు.