
హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మధుసూదన్ అనే జర్నలిస్ట్ మృతి చెందారు. మధుసూదన్ ప్రముఖ న్యూస్ సంస్థలో ఇంటర్నెట్ డెస్క్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రమాదంలో మధు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. లారీ కంటెయినర్ ప్యారడేజ్ నుండి బేగంపేట మీదుగా పంజాగుట్ట వైపు వెళుతుండగా, జర్నలిస్ట్ మధుసూధన్ అదే దారిలో TS 08 EM 7866 బైక్ పై ఈ ఉదయం 07.30 కి అఫీస్ కు వెళుతున్నారు. అయితే మహిళా డిగ్రీ కాలేజ్ ముందు లారీ కిందపడి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట్ పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. లారీ నీ అదుపులోకి తీసుకొన్నారు. మధుసూదన్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న అతని భార్య..బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
గాంధీలో టెస్టింగ్.. 48 శాంపిల్స్‌కు నెగెటివ్
బర్త్ డే పార్టీలో.. తలపై బీర్ బాటిల్స్ పగులగొట్టారు