జర్నలిస్టు రఘుకు 14రోజుల రిమాండ్

V6 Velugu Posted on Jun 03, 2021

జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు కిడ్నాప్ పై ఇవాళ(గురువారం) ఉద‌యం నుండి వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌తో పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్ట్ ర‌ఘును తామే అరెస్ట్ చేశామ‌న్నారు. గుర్రంపోడు భూముల కేసులో గ‌తంలో ర‌ఘుపై కేసు న‌మోదైంద‌ని, ఆ కేసులో భాగంగానే అరెస్ట్ చేశామ‌ని మ‌ఠంప‌ల్లి పోలీసులు చెప్పారు.ఇదే విషయాన్ని ర‌ఘు భార్య‌ లక్ష్మీ ప్రవీణకు కు స‌మాచారం ఇచ్చారు. ఉద‌యమే ర‌ఘును ఎవ‌రో తీసుకెళ్లిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు నిర్ధారించ‌గా, ర‌ఘును మ‌ధ్యాహ్నం అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్న జర్నలిస్ట్ రఘును.. హుజుర్ న‌గ‌ర్  సివిల్ జడ్జి ముందు హ‌జ‌రుప‌ర్చారు పోలీసులు. 14రోజులు రిమాండ్ విధించడంతో.. హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.

Tagged Journalist Raghu, remanded, 14 days, Huzurnagar Sub Jail

Latest Videos

Subscribe Now

More News