
కోల్బెల్ట్, వెలుగు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్డేగ సత్యం తెలిపారు. శుక్రవారం మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్లో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ వాస్తవాలకు విరుద్ధంగా కథనాలు రాస్తున్నారని, కొంతమంది డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరు వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లు అంటించుకొని నిజమైన పాత్రికేయులకు నష్టం చేస్తున్నారని, ఈ విషయాన్ని సీపీ, డీసీపీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.